మార్చి 31తో నాగార్జునసాగర్ నామినేషన్లకు తెరపడుతోంది. ఇంకో రెండు మూడు రోజులే ఉన్నా కూడా అధికార టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఎటూ తేల్చడం లేదు. బీజేపీ అభ్యర్థిగా ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతోంది. టీఆర్ఎస్ రెబెల్స్ నే పోటీకి దింపుతారని.. అందుకే లేట్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.
అయితే సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్ చార్జి కంకణాల నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం సంచలనమైంది. బీజేపీ అధిష్టానం మాత్రం నివేదిత రెడ్డిని ఫైన్ చేయకుండానే నామినేషన్ వేయడం సంచలనంగా మారింది.
అయితే బీజేపీ కండువా లేకుండానే నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్న వేళ నివేదిత రెడ్డి నామినేషన్ వేసి ఆ పార్టీకి షాకిచ్చారు.
గత అర్ధరాత్రి వరకు బీజేపీ ముఖ్య నేతలంతా కడారి అంజయ్య, నివేదిత రెడ్డి, ఇంద్రాసేనా రెడ్డిలతో చర్చలు జరిపారు. ఆశావహుల అభిప్రాయాలను పార్టీ సీనియర్ నేతలకు సంజయ్ తెలియజేశారు. పార్టీ సీనియర్లు సూచించిన వారి పేర్లను జాతీయ నాయకత్వానికి పంపించనున్నారు.
బీజేపీ అభ్యర్థి ఎంపిక ఆదివారం సాయంత్రానికి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా అంజయ్యయాదవ్, నివేదితరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రవినాయక్ ల పేర్లు సాగర్ బీజేపీ రేసులో వినిపిస్తున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి భార్య నివేదితరెడ్డి. గతంలో సాగర్ లో పోటీచేసి ఓడిపోయారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. అధిష్టానం ఇంకా ఖరారు చేయకముందే నామినేషన్ దాఖలు చేశారు. నివేదితను బీజేపీ రెబల్ అనాలా? లేక ఆమెనే క్యాండిడేట్ అన్నది తెలియడం లేదు. బీజేపీ మరో అభ్యర్థిని ప్రకటించినా సరే నివేదిత పోటీచేయాలనే భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే బీజేపీ రెబల్ గానైనా బరిలో ఉండడానికి నివేదిత రెడీ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇది బీజేపీ పెద్దలకు చిక్కుగా మారింది.