మంత్రి వర్గంపై చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. సుదీర్ఘ కాలంగా వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నవారు.. పార్టీ తరఫున ప్రచారం చేసిన వారు.. ఇలా.. అనేక మంది నాయకులు.. మంత్రి వర్గ రేసులో ఉన్నారు. ఇలాంటి వారిలో.. మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు కీలక నాయకులు.. ముందున్నారు. మైనారిటీ కోటాలో మార్పులు చేస్తే.. తమకు కావాలంటే..తమకు కావాలంటూ.. ఈ ఇద్దరు మైనారిటీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరిలో గుంటూరు జిల్లాలోని ఈ స్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ముందంజలో ఉన్నారు. ఇదేవిధంగా కర్నూలు జిల్లా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఏకంగా.. తన సోదరులతో వచ్చి ఇటీవల జగన్‌ను `మర్యాద` పూర్వకంగా కలిసి విన్నవించుకున్నారట.
దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే విషయం.. పార్టీలో ఆసక్తిగా మారింది. ముస్తఫా విషయానికి వస్తే.. 2014, 2019 వరుస ఎన్నికల్లో గెలిచి.. పార్టీ తరఫున పనిచేస్తున్నారు. గతంలో టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా.. ఆయన దూరంగా ఉండి.. వైసీపీ నేత జగన్‌కే మద్దతి చ్చారు.
జగన్ అదికారంలోకి రావాలంటూ.. ఆయన ప్రత్యేక ప్రార్ధనలు కూడా చేయించారు., పైగా.. ప్రజలకు అన్ని రూపాల్లోనూ అందుబబాటులో కూడా ఉంటున్నారు. మార్నింగ్‌వాక్‌కు వెళ్లిన సమయంలోనూ ప్రజల నుంచి పిటిషన్లు తీసుకుంటున్నారు. వారి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తున్నారు. ఎన్నారైలను జోడించి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయనకు జగన్ దగ్గర మంచి మార్కులు ఉన్నాయి.
ఇక, హఫీజ్ ఖాన్ విషయానికి వస్తే.. ఈయన జగన్ దృష్టిలో త్యాగమూర్తి. 2014లోనే కర్నూలు నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. అప్పట్లో జగన్ ఈయనను కాదని.. వేరేవారికి టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ.. హఫీజ్ నొచ్చుకోకుండా.. పనిచేసి.. అప్పట్లోనూ .. వైసీపీని గెలిపించారు. తర్వాత.. ఇక్కడ మారిన పరిణామాల రీతత్యా గత ఎన్నికల్లో హఫీజ్‌కు టికెట్ ఇచ్చారు.
అంతేకాదు.. మైనారిటీ వర్గంలోనే కాకుండా.. నియోజకవర్గంలోనూ ఫీల్ గుడ్ ఎమ్మెల్యేగా ఈయన పేరు తెచ్చుకున్నారు. పైగా పపార్టీపై గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలని.. ఇటీవల స్వయంగా సీఎం జగన్‌ను కలిసి విన్నవించారు.
ఈ నేపథ్యంలో అటు ముస్తఫా ను చూస్తే.. మంచి నాయకుడు అనే పేరు ఉండడంతో పాటు వరుస విజయాలు సొంతం చేసుకుని.. ప్రత్యర్థి పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా.. తిరస్కరించి వైసీపీలో కొనసాగుతున్న నాయకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఇటు.. హఫీజ్ జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడనే పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని ఆయన ఎంపిక చేస్తారు? అనే ది ప్రస్తుతం వైసీపీ వర్గాల మధ్య చర్చగా ఉంది. ప్రస్తుతం కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా.. మంత్రిగా.. డిప్యూటీ సీఎఎంగా ఉన్నారు. మంత్రి వర్గ ప్రక్షాళనలో ఆయనను పక్కన పెట్టడం ఖాయంగా మారిన నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు పోటీ పడుతుండడం గమనార్మం.