కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించడం మొదలు కాగానే దానికి టీకా కనుగొనేందుకు వందల ఫార్మాసూటికల్ కంపెనీలు ప్రయోగాలు మొదలుపెట్టాయి. వేల కోట్ల పెట్టుబడితో వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలయ్యాయి. పదుల సంఖ్యలో కంపెనీలు ఈ దిశగా ముందడుగు వేశాయి. ఫైజర్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, మోడర్నా, స్పుత్నిక్ లాంటి సంస్థలు ఇప్పటికే టీకాను అభివృద్ధి చేశాయి. చాలా దేశాల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇండియాలో సైతం భారత్ బయోటెక్ సహా కొన్ని సంస్థలు టీకాను సాధ్యమైంత త్వరగా బయటికి తెచ్చేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. కాగా కొందరు నిపుణులు మాత్రం వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేసరికి వైరస్ ప్రభావం తగ్గొచ్చని, అలాగే వైరస్ రూపం మార్చుకుని వ్యాక్సిన్‌కు తలొగ్గని స్థితికి చేరొచ్చని అంచనాలు వేశారు. ఈ రెండు అంచనాలు దాదాపు నిజమయ్యే పరిస్థితే ఉంది.
గతంతో పోలిస్తే కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం. అలాగని దాన్ని లైట్ తీసుకోవడానికి కూడా లేదు. ఇదిలా ఉండగా యూకేలో కరోనా వైరస్ కొత్త రూపంలోకి మారడం ఇప్పుడు కలకలానికి కారణమవుతోంది. బ్రిటన్‌లోనే 60 ప్రాంతాల్లో కొత్తగా వెయ్యికి పైగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని.. ఈ బాధితుల నమూనాలను పరీక్షించగా వైరస్ కొత్త రూపం కనిపించిందని.. ఇది ఇంతకుముందున్న వైరస్‌తో పోలిస్తే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ వెల్లడించాడు. బ్రిటన్‌తో పాటు వేరే దేశాల్లోనూ ఈ వైరస్ కొత్త వేరియెంట్‌ను కనుగొన్నట్లు ఆయన తెలిపాడు. ఐతే ఈ కొత్త వేరియెంట్ మీద కరోనా వ్యాక్సిన్ పని చేయదు అనడానికి కారణాలేమీ కనిపించడం లేదని.. వ్యాక్సిన్‌కు అది లొంగుతుందనే ఆశాభావంతో ఉన్నామని హెల్త్ సెక్రటరీ పేర్కొన్నాడు. కానీ వైరస్ ఇలా రూపం మార్చుకుందని, మునుపటితో పోలిస్తే చాలా వేగంగా విస్తరిస్తోందని అనడం మాత్రం కంగారు పెట్టించేదే.