కరోనా మహమ్మారి ప్రపంచదేశాలతోపాటూ మన దేశాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. దేశ ఆర్థికవ్యవస్థ కూడా పతనమైంది. వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందన్న ప్రకటనలే తప్పితే.. ఇంతవరకూ వ్యాక్సిన్ పంపిణీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై గురించి డబ్ల్యూహెచ్వో మరో పిడుగులాంటి వార్త చెప్పింది. భారతదేశంలో రానున్న చలికాలంలో కరోనా మరింత విజృంభించనుందని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్న ప్రజలకు ఈ వార్త విని ములిగే నక్కమీద తాటికాయ పడ్డట్టయ్యింది. ఇప్పటికే రెండు తెలుగురాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో చలికాలంలో మరింత వ్యాప్తి చెందితే పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతిఏడాది చలితో ఎంతోమంది వృద్ధులు, బలహీనంగా ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈ సారి కరోనాకూడా తోడైతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
ఆస్తమారోగులూ.. జర జాగ్రత్త
ప్రస్తుతం మనదేశంలో కరోనా ఓ రేంజ్లో విరుచుకుపడుతోంది. ప్రతిరోజూ సరాసరి 70 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం. మరికొన్ని రోజుల్లోనే మొదటిస్థానానికి ఎగబాకవచ్చు. మరోవైపు కరోనాతో ఆస్తమా రోగాలు జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది. ఆస్తమా రోగులకు కరోనా తొందరగా వచ్చే అవకాశం ఉంటున్నదని చెబుతోంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులతో పాటు ఆస్తమా, హృద్రోగులు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్వో హెచ్చరిస్తోంది.