అసెంబ్లీ నియోజకవర్గం : సత్తెనపల్లి
టీడీపీ: కోడెల శివప్రసాద్
వైసీపీ: అంబటి రాంబాబు
జనసేన: వై.వెంకటేశ్వర్ రావు
గుంటూరు జిల్లాలోని సత్తెపల్లి నియోజకవర్గంపైనే అందరి కన్ను ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన కోడెల శివప్రసాద్ వైసీపీ అభ్యర్థి బలమైన అంబటి రాంబాబుపై కేవలం 924 ఓట్లతో గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ వారే ప్రత్యర్థులు కావడంతో భారీ మెజారిటీ సాధిస్తామని కోడెల చెబుతుండగా.. ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తామని అంబటి చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో కాపు ఓట్లు ఎక్కువగానే ఉండడంతో జనసేన అభ్యర్థి వెంకటేశ్వర్ రావు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- సత్తెనపల్లి చరిత్ర:
మండలాలు: నెకరిల్లు, రాజుపెలెం, సత్తెనపల్లి, ముప్పాళ్ల
ఓటర్లు: 2 లక్షల 20 వేలు
1952లో నియోజకవర్గం ఏర్పడింది. మొదట కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలిచి ఐదుసార్లు జెండా ఎగురవేశారు. ఆ తరువాత టీడీపీ 3 సార్లు గెలుపొందింది. స్వతంత్రులు రెండుసార్లు, సీపీఐ ఒకసారి గెలుపొందాయి.
*కోడెలకు కుమారుడితో దెబ్బ..
2014 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన కోడెల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేశారు. ఓ వైపు స్పీకర్ పదవి నిర్వహిస్తూనే మరోవైపు ప్రజలకు దగ్గరయ్యారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరిపి సత్తెనపల్లిని నెంబర్ 1 స్థానానికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అయితే కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ వ్యవహార శైలిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. భూ కబ్జాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లోకల్ వ్యాపారస్తుల వద్ద ట్యాక్స్ వసూలు చేశారని అంటున్నారు. దీంతో సొంత పార్టీ నేతలే ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ఆందోళనలు చేశారు. కానీ ఎలాగోలా టికెట్ తెచ్చుకున్నారు.
* అనుకూతలు:
-నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
-సత్తెనపల్లిని ఓడీఎఫ్ లో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడం
-టీడీపీ కేడర్ బలంగా ఉండడం
* ప్రతికూలతలు:
-సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి
-కుమారుడి వ్యవహారి శైలిపి ప్రజల అసంతృప్తి
-ఎంపీగా పోటీ చేస్తున్న రాయపాటితో సఖ్యత లేకపోవడం
* గెలుపుపై అంబటి నమ్మకం..
గత ఎన్నికల్లో ఓడిపోయిన అంబటి రాంబాబు ఈసారి ఎలాగైనా గెలిచి తీరుతానని నమ్మబలుకుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నాడు. ఐదేళ్లలో పార్టీ బలం పెంచగలిగాడు. మరోవైపు పార్టీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుల్లో అంబటి రాంబాబు ఒకరు. అయితే వైసీపీలో ఓ వర్గం ఈయనకు టికెట్ ఇవ్వొద్దని పార్టీ అధినేతపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ గత ఎన్నికల్లో ఆయన తీసుకొచ్చిన మెజారిటీని చూసి జగన్ ఆయనకే సీటు కేటాయించారు.
* అనుకూలతలు:
-పార్టీలో కీలక నేతగా కొనసాగడం
-టీడీపీపై వస్తున్న వ్యతిరేకత
-పార్టీకి పెరిగిన బలం
* ప్రతికూలతలు:
-వైసీపీలో వ్యతిరేక వర్గం సహకరించకపోవడం
-టీడీపీకి బలమైన నియోజకవర్గం
*టఫ్ ఫైట్ లో గెలుపెవరిది?
ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరుపున వెంకటేశ్వర్ రావు పోటీ చేస్తుండడం ప్రధాన అభ్యర్థులకు మైనస్ గా మారనుంది. కాపు ఓట్లు ప్రభావితం చేసే ఈ నియోజకవర్గలో జనసేన పోటీతో చీలే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ గెలుస్తుందా. ? లేక వైసీపీకి లాభమవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే అంబటి రాంబాబు ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. జగన్ పాదయాత్ర, వైసీపీ గాలి , కోడెలపై వ్యతిరేకత గెలిపిస్తుందని ఆశలు పెంచుకున్నారు.. చూడాలి మరి ఫలితం ఎలా ఉంటుందో..