పార్టీ అధినేతే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే.. నేతలకు అపాయింట్మెంట్ దక్కడం అంత తేలిక ఏమీ కాదు. జాతీయ పార్టీల్లో అయితే.. రాష్ట్రాల స్థాయిల్లో ఒక ప్రెసిడెంట్, జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్, ఇంకా ఇన్ చార్జి, ఆపై ముఖ్యమంత్రి.. ఇలా ఎంతో మంది ఉంటారు. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా పార్టీలోని ముఖ్య నేతలను కలుస్తూ ఉంటారు ఆ పార్టీల్లోని నేతలు.
అయితే ప్రాంతీయ పార్టీల్లో అధినేతే సుప్రిమో. ఆయనే ముఖ్యమంత్రి కూడా కావడంతో.. పార్టీ వాళ్లకు అంత తేలికగా అధినేత దర్శనం లభించదు. ఏ పబ్లిక్ మీటింగులోనో, ప్రభుత్వ కార్యక్రమంలోనో కలిసే అవకాశం దక్కినా.. అక్కడ విన్నపాలకు అవకాశం కూడా ఉండదు. అందుకే వ్యక్తిగత మీటింగుల కోసం వారు వేచి చూస్తూ ఉంటారు.
ఈ క్రమంలో తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను కొంతమంది నేతలు కలిశారు. తాము సీఎంను కలిసినట్టుగా వారు ప్రెస్ కు కూడా చెప్పారు. ఆ జాబితాలో ఎమ్మెల్యే కమ్ ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా తోపాటు ఎమ్మెల్యేలు వై.వెంకట్రామిరెడ్డి, జోగి రమేశ్, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డిలు జగన్ నుకలిసినట్టుగా తెలుస్తోంది. వేర్వేరుగా వీరు సీఎంతో సమావేశం అయినట్టుగా సమాచారం.
అలాగే వైసీపీ నేత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి కూడా జగన్ తో సమావేశం అయ్యారు. వీరితో ప్రముఖ వైద్యుడు, గాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్ట్ డి. నాగేశ్వర్ రెడ్డి కూడా జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయిన వారిలో ఉన్నారు