ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి సీఎంను తామెప్పుడూ చూడలేదన్న మాట రాజకీయ వర్గాలు సైతం ఒప్పేసుకుంటున్నాయి. తానేం అనుకుంటానో.. దాన్ని మాత్రమే చేసుడు తప్పించి.. మరే రకంగానూ వెనక్కి తగ్గని మొండితనం కేసీఆర్ సొంతం. అలాంటి ఆయన తన అభిమతానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను చివరకు ఎంతవరకూ తీసుకొచ్చారో తెలిసిందే.
సమ్మెతో సర్కారు కొమ్ములు వంచుతామన్న కార్మికులే.. నేడు అయ్యా బాబు.. మా ఉద్యోగాలు మేం చేసుకుంటామనే వరకూ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆర్టీసీ అంశాన్ని ప్రధానంగా తీసుకొని కాబినెట్ మీటింగ్ ను ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే.. రెండు రోజుల పాటు కొనసాగించాలన్న ఆలోచనలో ఉండటం ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా కేసీఆర్ అధ్యక్షత వహించే మంత్రిమండలి సమావేశం అన్నంతనే కనీసం ఐదారు గంటలు.. ఏడెనిమిది గంటల మారథాన్ మీటింగ్ మామూలే. అలాంటిది ఏకంగా రెండు రోజుల పాటు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.
తానేం చెబితే దాన్నే మిగిలిన వారంతా ఫాలో కావాలన్న మైండ్ సెట్ తో పాటు.. వన్ సైడ్ బ్యాటింగే తప్పించి.. మంత్రుల అభిప్రాయాల్ని పరిగణలోకి పెద్దగా తీసుకునే అలవాటు లేని కేసీఆర్.. రెండు రోజుల పాటు కాబినెట్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే.. దాని వెనుక కారణం వేరే ఉందంటున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆర్టీసీ ప్రధాన సబ్జెక్ట్ గా తీసుకొని పెట్టే ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే అంశంతో పాటు.. సమ్మె చేసినకార్మికులను ఏదోలా వదిలించుకునేందుకు వీఆర్ఎస్ ను ప్రకటించేందుకు వీలుగా కేసీఆర్ ప్లాన్ ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. సమ్మె విషయంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రులు ఏ మాత్రం సానుకూలంగా లేరన్న విషయం వారి ప్రైవేటు సంభాషణల్లో తెలిసిపోతుంది. అలా అని.. తమ భావాల్ని ముఖ్యమంత్రి ఎదుట బయటపెట్టేంత సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి.
అలా అని తన కాబినెట్ లో ఎంతమంది ఆర్టీసీ విషయంలో తన స్టాండ్ ను వ్యతిరేకిస్తున్నారో కేసీఆర్ కు తెలియంది కాదు. కాకుంటే.. తనను వ్యతిరేకించేవారు.. తన చర్యల పట్ల సానుకూలంగా లేని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపటం.. తాను చేస్తున్న పని సరైనదన్న నమ్మకాన్ని కలిగించటం కోసమే ఈ సుదీర్ఘ సమావేశంగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ మంత్రిమండలి సమావేశంలో ఆర్టీసీ లెక్కతోపాటు.. ఉద్యోగుల ఇష్యూను ఒక కొలిక్కి తీసుకురావటం ఖాయమంటున్నారు.