అబుస‌లేంకు ఉరిశిక్ష ఎందుకు వేయ‌లేదంటే

Update: 2017-09-07 12:57 GMT
ఇటీవ‌లి కాలంలో దేశ‌వ్యాప్తంగా కీల‌క తీర్పులు వెలువ‌డుతుండ‌టం వాటిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంటున్న సంగ‌తి తెలిసిందే. అంత‌టి సంచ‌ల‌న తీర్పులు వెలువ‌డుతుండ‌టం కూడా ఒక కార‌ణం. తాజాగా అలాంటి తీర్పే ఇవాళ వ‌చ్చింది. 1993లో ముంబై పేలుళ్లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. గ్యాంగ్‌ స్ట‌ర్ అబూ స‌లేమ్ 1993 ముంబై పేలుళ్ల కేసులో కీల‌క దోషి.  ముంబై పేలుళ్లకు కార‌ణ‌మైన ఆయుధాల‌ను అబూ స‌లేమ్ చేర‌వేశాడు. ఆ ఆరోప‌ణ‌ల‌పైన అబూకు టాడా కోర్టు ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. కానీ ఇవాళ టాడా కోర్టు అబూకు కేవ‌లం జీవిత ఖైదు శిక్ష‌ను మాత్ర‌మే విధించింది. జీవిత ఖైదు అంటే.. అది కూడా 25 ఏళ్లు మాత్ర‌మే. కానీ ఇదే కేసులో ఇవాళ మ‌రో ఇద్ద‌రికి ఉరిశిక్ష‌ను ఖరారు చేశారు. కానీ అబూ స‌లేమ్‌ కు మాత్రం ఆ శిక్ష ప‌డింది.

ఒకే తీర్పు..రెండు శిక్ష‌లు ఏంట‌ని ప‌లువురు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు న్యాయ‌నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. ముంబై పేలుళ్ల త‌ర్వాత దేశం విడిచి ప‌రార‌య్యాడు. అత‌ను పోర్చుగ‌ల్‌ లో త‌ల‌దాచుకున్నాడు. 2005లో మ‌న పోలీసులు పోర్చుగ‌ల్ నుంచి అత‌న్ని ప‌ట్టుకువ‌చ్చారు. కానీ పోర్చుగ‌ల్ చ‌ట్టం ప్ర‌కారం ఆ దేశం అప్ప‌గించే ఏ వ్య‌క్తికైనా మ‌ర‌ణ‌శిక్ష విధించ‌రాదు. ఇది ఆ దేశ ఒప్పందం. ఎందుకంటే ఆ దేశంలో ఏ నేరానికైనా మ‌ర‌ణ‌శిక్ష లేదు. పోర్చుగ‌ల్ చ‌ట్టాల ప్ర‌కారం అత్య‌ధికంగా 25 ఏళ్లు మాత్రమే జైలు శిక్ష‌ను విధించ‌గ‌ల‌రు. అద‌న్న‌మాట మ్యాట‌ర్‌.

ముంబై బాంబు పేలుళ్ల కేసులో వాస్త‌వానికి అబూ స‌లేమ్‌ కు మ‌ర‌ణ‌శిక్ష విధించాలి. కానీ పోర్చుగ‌ల్ నుంచి హామీ తీసుకున్న నేప‌థ్యంలో అత‌నికి ఉర‌శిక్ష‌ను ఖ‌రారు చేయ‌లేక‌పోయారు. ఐపీసీ 123 - 302 ప్ర‌కారం అబూకు ఉరిశిక్ష‌ను ఖరారు చేసే వీలు ఉన్నా - పోర్చుగ‌ల్‌ తో కుదిరిన ఒప్పందం వ‌ల్ల అతనికి కేవ‌లం జీవిత కాల శిక్ష‌ను మాత్ర‌మే ఖ‌రారు చేశారు. ఇండియ‌న్ ఎక్స్‌ ట్ర‌డిష‌న్‌ యాక్ట్‌ లో కొన్ని మార్పులు చేసిన త‌ర్వాత‌నే అబూను భార‌త్‌ కు తీసుకురావ‌డం వీలైంది. ఈ విష‌యాన్ని సీబీఐ బృందానికి చెందిన ఓపీ చ‌త్వాల్ తెలిపారు. ఈయ‌న నేతృత్వంలోనే సీబీఐ బృందం లిస్బ‌న్ వెళ్లి అబూను ప‌ట్టుకురాగ‌లిగింది. ఇదే కేసులో మోనికాను కూడా ఇలాగే తీసుకువ‌చ్చారు. ఉగ్ర‌దాడి కోసం గుజ‌రాత్‌ లోని బారుచ్ నుంచి ముంబైకి అబూ ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేశాడు. ఆ ఆరోప‌ణ‌ల‌పైనే స‌లేమ్‌ కు శిక్ష‌ను ఖరారు చేశారు.
Tags:    

Similar News