అచ్చెన్నాయుడు టీడీపీ ఎందుకు సైలెంట్ అవుతున్నారు

Update: 2021-03-24 16:30 GMT
అచ్చెన్నాయుడు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు. చంద్రబాబు తర్వాత పార్టీలో నంబర్ 2 లాంటి వ్యక్తి. చంద్రబాబు ప్రభుత్వంలో జగన్ ను చెడుగుడు ఆడిన నేత. అలాంటి నేతకు చంద్రబాబు సరైన ప్రాధాన్యమే ఇచ్చారు. తెలుగు దేశం పార్టీకి  ఆంధ్రప్రదేశ్ యూనిట్ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీలో బలమైన కింజారాపు అచ్చెన్న నాయుడుకు అందలమెక్కించినా ఆయన మాత్రం పార్టీలో యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు.  క్రికెట్ జట్టులో 12 వ ఆటగాడి మాదిరిగా సమయం వచ్చినప్పుడే సబిస్ట్యూట్ లా వస్తున్నారు.  ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, పార్టీలో నిరంతరం సమస్యలపై పోరాడలేక పక్కకు తప్పుకుంటున్నారు. టిడిపి కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు.  

ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో టిడిపికి అచ్చెన్నాయుడు కుటుంబం చాలా ముఖ్యమైనది.  ఎందుకంటే ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఒక ఎంపి టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్నారు. అలాగే 2019 ఎన్నికలలో జగన్ సునామీ రాష్ట్రాన్ని తుడిచిపెట్టినప్పుడు పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకోగలిగిన ఏకైక టిడిపి రాజకీయ కుటుంబం ఇదే. వాస్తవానికి, అచ్చాన్నాయుడు కుమార్తె అదిరెడ్డి భవానీ ఇప్పుడు టిడిపిలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే. అయినప్పటికీ, టిడిపి అనుకూల మీడియా ఆయనను విస్మరిస్తోంది. వాస్తవానికి  పార్టీ  ఇటీవలి సంస్థాగత ఎన్నికల్లో తేలిపోయింది. అచ్చెన్నాయుడు సిఫారసు చేసిన పేర్లన్నీ డస్ట్‌బిన్‌కు చేరాయి. అధిష్టానం వేరే వారికి టికెట్లు ఇచ్చింది. .

టిడిపి అనుకూల మీడియా, టిడిపి స్థాపన నుంచి పార్టీ కోసం శ్రమించిన అచ్చెన్నను విస్మరించడానికి రెండు కారణాలున్నాయని వర్గాలు చెబుతున్నాయి. కుటుంబం నుంచి యువ ఎంపీ, కె. రామ్మోహన్ నాయుడు నారా లోకేష్ కు ముప్పుగా భావించవచ్చని తెలుగుదేశం కోటరీ భావిస్తోందట.. రామ్మోహన్ నాయుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఆయన భాష పంచులు ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా ఉంటాయి.  పార్లమెంటులో హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిలో ఆయన చేసిన ప్రసంగాలు విస్తృతంగా ప్రశంసించబడ్డాయి. . రామ్మోహన్ నాయుడుకు కవరేజ్ ఇవ్వడం వల్ల పార్టీలో నారా లోకేష్ బాబు స్థానానికి అపాయం కలుగుతుందని టిడిపి అనుకూల మీడియా అచ్చెన్నాయుడు ఫ్యామిలీని దూరం పెడుతోందని సమాచారం.  
Tags:    

Similar News