కొన్ని విషయాలు మహా చిత్రంగా ఉంటాయి.అందునా.. కొంతమంది ప్రముఖులు చెప్పే కొన్ని మాటలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. వారి మాటల్లో వారి స్థాయి ఏమిటన్న విషయం చెప్పకనే చెప్పేస్తున్నట్లు ఉంటుంది. సామాన్యులకు.. ప్రముఖులకు మధ్య తేడా ఏమిటో తెలియజేసే ఈ విషయాన్నితాజాగా ప్రముఖ సినీ నటి గౌతమి వెల్లడించారు. కావాలని చెప్పకున్నా.. ఆమె మాటల్లో ఉన్న అండర్ లైన్ మాటల్ని చూసినప్పుడు ఈ విషయం అర్థం కాక మానదు.
ఇటీవల ప్రధాని మోడీని ప్రముఖ సీనియర్ సినీ నటి గౌతమి భేటీ అయ్యారు. కమల్ తో సహజీవనం నుంచి కటీఫ్ చేసుకున్న ఆమె.. ఈ మధ్యన సామాజిక సేవా కార్యక్రమాల్ని చేపట్టారు. కమల్ ఇటీవల పార్టీని ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే.. ప్రధాని మోడీతో గౌతమి భేటీ కావటంతో ఆమె బీజేపీలో చేరనున్నట్లుగా ప్రచారం జరిగింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఒక వెబ్ ఛానల్ కు గౌతమి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. మోడీతో భేటీ మీద ఆమె చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. తాను ఈ మధ్యన ఒక స్వచ్ఛంద సంస్థను స్టార్ట్ చేశానని.. ఆ సంస్థకు సంబంధించిన సలహాలు.. సూచనలు తీసుకోవటానికి మోడీతో భేటీ అయినట్లుగా వెల్లడించారు. తన ఫౌండేషన్ గురించి మోడీకి తెలియజేయటానికి.. ఆయన సలహాల కోసమే తాను భేటీ అయినట్లు చెప్పారు.
మోడీ మంచి పథకాల్నిఅమలు చేస్తున్నారని.. కానీ వాటిని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లనట్లుగా చెప్పిన గౌతమి మాటలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయని చెప్పాలి. ఒకపక్క తన సంస్థకు సలహాలు.. సూచనలు కోసమే ప్రధాని మోడీని కలిసినట్లుగా చెప్పిన ఆమె.. ఉల్టాగా మోడీ సర్కారు తప్పులు ఎక్కడ చోటు చేసుకుందన్న విషయాన్ని చెప్పటం చూస్తే.. గౌతమికి సలహాలు కావాలా? లేదంటే సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? అన్న సందేహం కలుగక మానదు.