బాబు క‌ల‌ల ప్రాజెక్టుపై మోదీ రెడ్ ఫ్లాగ్‌

Update: 2017-10-13 12:03 GMT
ఏపీ రాజ‌ధాని నిర్మాణం అంత‌ర్జాతీయ స్థాయిలో చేప‌డుతున్నామ‌ని, ఇక ఏపీకి తిరుగులేద‌ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చిన చంద్ర‌బాబుకు కేంద్రం బ్రేక్ వేసిందా?  రాజ‌ధాని భూముల విష‌యంలో కొర్రీలు పెట్టిందా?  అనుమ‌తుల పేరుతో తాత్సారం చేసిందా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఏపీ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేయకుండా కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోంది. ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండింగులో ఉన్న ఈ బిల్లుపై కొర్రీలు వేస్తోంది. గుజరాత్ - తెలంగాణ ప్రభుత్వాల తరహాలోనే ఏపీ ప్రభుత్వ బిల్లు ఉన్నప్పటికీ ఆ రెండు రాష్ట్రాలకు ఆమోదం తెలిపిన కేంద్రం - ఏపీకి మాత్రం ప్రశ్నలు సంధిస్తోంది.  

రాజ‌ధాని భూముల‌కు సంబంధించిన బిల్లును కేంద్రం ఆమోదించాల్సి ఉంది. అయితే, కేంద్ర హోంశాఖ ఈ బిల్లును కేంద్ర వ్యవసాయ సాఖకు పంపించింది. దాంతో ఆ శాఖ ఆహార భద్రతకు సంబంధించిన ప్రశ్నలు సంధించింది.  రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కొత్తగా పన్నెండు లక్షల హెక్టార్లను సాగులోకి తెస్తున్నామని, భూసేకరణ చట్టానికి తాము సవరించిన ప్రతిపాదన విష‌యంలో ఆహార భద్రతపై ఎలాంటి ప్రభావం చూపదని ఏపీ వివరణ ఇచ్చింది. ఎక్కువ భూములను వరి సాగు కోసం ఉపయోగిస్తున్నారని, పైగా మరో 12 లక్షల హెక్టార్ల భూమిని కొత్తగా సాగులోకి తెస్తున్నామని ఏపీ చెప్పింది.

అయితే, ఏపీ వివరణతో కేంద్ర వ్యవసాయ శాఖ సంతృప్తి చెందలేదట. కొత్తగా సాగులోకి తెస్తున్న ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నదీ చెప్పాలని నిల‌దీసింది. దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇర‌కాటంలోకి ప‌డిపోయింది. అంతేకాదు, ఇప్పుడు కొత్తగా ఆ 12 లక్షల హెక్టార్లను ఎక్కడ సాగులోకి తెస్తోంది కేంద్రానికి చూపించాలి. అధికారుల‌ను  మెప్పించాలి. అప్ప‌టికి కానీ రాజ‌ధాని విష‌యంలో గ్రీన్ సిగ్న‌ల్ రాదు. దీంతో ఇక ఈ నిర్మాణం ఎప్ప‌టికి పూర్త‌య్యేనో బాబుగారు ఏమంటారో చూడాలి. మ‌రి రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఏమిటి ప్ర‌యోజ‌నమో తెలియాల్సి ఉంది. బాబుగారు ఏం చెబుతారో చూడాలి.
Tags:    

Similar News