శుక్రవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వ్యూహాత్మకంగా ఓటుకునోటు కేసును అంశాన్ని ఏపీ విపక్షం తెరపైకి తీసుకురావటం తెలిసిందే. మరి.. విపక్షం ఆలోచన ముందే తెలిసిందో ఏమో కానీ.. సభకు రావాల్సిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా తన ఛాంబర్ కే పరిమితం కావటం ఆసక్తికరంగా మారింది.
ఓటుకు నోటు విషయంలో.. బయటకు వచ్చిన ఆడియో టేపులో ఉన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి గొంతా? కాదా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ విపక్ష నేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించటం తెలిసిందే. వాస్తవానికి జగన్ తన సూటి ప్రశ్నను సంధించే సమయంలో ముఖ్యమంత్రి సభలో లేకుండా.. తన ఛాంబర్‌కు పరిమితం కావటం గమనార్హం.
ఓటుకు నోటు విషయంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందన్న ఉద్దేశంతోనే.. చంద్రబాబు సభకు రాకుండా ఉండిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. అసలు సభకు రాకుండా.. వేరే చోట కార్యక్రమం పెట్టుకునే వారు కదా అని బాబు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా అసెంబ్లీలో ఉండి కూడా ముఖ్యమంత్రి సభకు హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారిందనటంలో సందేహం లేదు.