బ్రిటన్ రాజవంశం రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు?

Update: 2022-09-12 00:30 GMT
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని విస్తరించిన రాజ కుటుంబం వారిది. బ్రిటన్ రాజవంశానికి బ్రిటీషర్లలో ఎంతో అత్యున్నత స్థాయి గౌరవం ఉంది. ప్రస్తుతం బ్రిటన్ ను అధికారికంగా ఏలుతున్న వేల్స్ రాజ కుటుంబం మూడు వందల ఏళ్లకు పై నుంచి ఇక్కడ రాజరికాన్ని చలాయిస్తోంది. 1701లో కింగ్ డమ్ ఆఫ్ ఇంగ్లండ్, కింగ్ డమ్ ఆఫ్ స్కాట్ లాండ్, కింగ్ డమ్ ఆఫ్ ఐర్లాండ్ ల కలయికతో నాటి యునైటెడ్ కింగ్ డమ్ ఏర్పడింది. అప్పుడు సంప్రదాయాల ప్రకారం.. మోనార్క్ గా బాధ్యతలు చేపట్టారు క్వీన్ యాన్. ఆ తర్వాత బ్రిటీష్ కింగ్ డమ్ ఎంతో విస్తరించింది. కాలనీలు ఏర్పాటు చేసుకుంది. కాలనీలకు కూడా క్వీన్ లేదా కింగ్ మోనార్క్ అయ్యారు. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమయ్యాక.. పూర్తిగా బ్రిటీష్ రాజుల పాలిటే పాలన సాగింది.

ఇప్పటికీ   ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఒకనాటి బ్రిటీష్ కాలనీలు.. బ్రిటన్ నాగరికత విస్తరించిన దేశాల్లో బ్రిటీష్ క్వీన్ లేదా కింగ్ ను తమ మోనార్క్ గానే భావించే సంప్రదాయం ఉంది.

గత 300 ఏళ్లలో 13వ రాజు చార్లెస్ త్రీ. క్వీన్ ఎలిజిబెత్ 2 పెద్ద కొడుకు ఇతడు. ఇప్పటికీ రాజుల ఇంటిపెళ్లిళ్లు.. శుభకార్యాలు అంటే బ్రిటన్ కు పండుగ.. మూడో చార్లెస్ పెద్ద కొడుకు ప్రిన్స్ విలియమ్, కేట్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బ్రిటన్ కే పెద్ద పండుగలా వారి పెళ్లి జరిగింది కొన్నేళ్ల కిందట.. వారు జంటగా ఎక్కడ కనిపించినా.. అదొక క్రేజీ సీనే..  రాజ కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలూ బ్రిటన్ లో ఎంతో భావోద్వేగపూరితమవుతూనే ఉన్నాయి.  ఈ గౌరవాన్ని ఈ తరంలోనూ కాపాడుకుంటోందంటే అది బ్రిటన్ రాజకుటుంబం వ్యవహరించే తీరులో కూడా ఎంతో పరిపక్వత ఉన్నట్టే.  

ఆ సామ్రాజ్యానికి రాజరిక వారసులం అని చెప్పి ఈ కుటుంబీకులు ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేయరు. ప్రజలకు సన్నిహితులుగానే ఉంటారు. అలాగని రాజకీయ ప్రమేయం చేయరు. బ్రిటీష్ రాచరిక కుటుంబం పెట్టుకున్న అతిపెద్ద, కఠిన నియమం ఏంటంటే రాయల్ ఫ్యామిలీ నుంచి ఎవరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లకూడదన్నది నియమం.

బ్రిటన్ రాజకుటుంబానికి వ్యాపారలే ఆర్థిక వనరులు. ప్రథమ సంతానం రాజులు లేదా రాణులు అవుతారు. బతికున్నన్నీ రోజులు వారే ఆ హోదాలో ఉంటారు. మిగతా వారు ఆశ ఉన్నా కూడా రాజకీయాల్లోకి రారు. ప్రధాని ఎన్నికల్లోనూ రాణి, కుటుంబ సభ్యులు ఎవరికి అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రకటన చేయరు. ఫలానా వారిని గెలిపించాలని సూచించరు. వారు పెట్టుకున్న ఈ గొప్ప సంప్రదాయాలే వారిని ప్రజల్లో గౌరవాన్ని నిలుపుతున్నాయి.

బ్రిటీష్ రాజకుటుంబం పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో విలాసాలు చేయరు. వారికి ప్రత్యేకంగా వ్యాపారాలు, భూములు ఉంటాయి. వాటి నుంచి ఆదాయమే రాజకుటుంబానికి కావాల్సినంత స్థాయిలో ఉంటుంది.  రాజ కుటుంబం ఇన్నాళ్లు గౌరవ మర్యాదలతో ఉండడానికి ఇదీ ఒక కారణంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News