ఒక సామాన్యురాలు సూటి ప్రశ్నను సంధించింది. రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత ఇష్యూలో రోడ్డెక్కి నిరసన చేసే క్రమంలో సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఒక రేంజ్లో తిట్టేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేయటం తెలిసిందే. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ కు చెందిన బనావత్ లక్ష్మీపై కేసు పెట్టిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి.. ఆరు గంటల అనంతరం విడుదల చేశారు.
ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించినందుకు ఆమెపై చర్యలు చేపట్టారు. దీనిపై లక్ష్మీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళ అని చూడకుండా అరెస్ట్ చేసి ఆరు గంటలు అదుపులో ఉంచుకున్నారన్నారు. మార్కెట్లో యూరియా దొరకని కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు.
ఈ కారణంగా ఆవేశంలో కేసీఆర్ ను తిట్టాల్సి వచ్చిందన్నారు. దొరకని యూరియా.. పెరిగిన అప్పులతో బాధలు భరించలేక రోడ్డెక్కి ధర్నా చేశామన్నారు. యూరియా కోసం విపరీతంగా తిరగాల్సి వస్తోందన్నారు. భూపతిపూర్ వాసులు ఎరువుల కోసం రామాస్ పేటకు వెళితే.. రాయికల్ వెళ్లమని చెప్పారని.. అక్కడికి వెళితే భూపతిపూర్ సొసైటీలోనే తీసుకోవాలని.. చెప్పారని.. ఈ వేదనతోనే తాను ప్రభుత్వాన్ని నిందించినట్లు చెప్పారు.
సీఎంను తిట్టానని తనను అరెస్ట్ చేసిన పోలీసులు.. హిందుగాళ్లు.. బొందుగాళ్లు అన్న కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన ఏ వాగ్దానం నెరవేర్చలేదని.. ఇదేనా బంగారు తెలంగాణ? అని ప్రశ్నించారు. సామాన్యురాలైన లక్ష్మీ సంధించిన ప్రశ్న ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది. సీఎంను సామాన్యుడు తిడితే కేసు కట్టి అరెస్ట్ చేసినప్పుడు.. ఒక వర్గానికి చెందిన వారిని బొందుగాళ్లు అంటూ వ్యాఖ్యలు చేయటం తప్పు కాదా? అన్న క్వశ్చన్ ఇప్పుడు వ్యక్తమవుతోంది.