జయలలిత చనిపోయి ఐదు రోజులు అయిపోయింది. రోజులు గడిచే కొద్దీ జనాల్లో బాధ తగ్గుతుందనుకుంటే ఇంకా పెరుగుతోంది. ఎందుకంటే అమ్మ మరణం మీద రోజుకో కొత్త వార్త బయటికి వస్తోంది. అనేక సందేహాలకు తావిస్తోది. రెండున్నర నెలలుగా జయ ఆసుపత్రిలో ఉన్న జయ ఆరోగ్యం గురించి వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు వార్తలు వచ్చాయి. ఆమె కోలుకుందనుకున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడం.. ప్రాణాలు కోల్పోవడం అమ్మ అభిమానులకు అసలేమాత్రం మింగుడుపడటం లేదు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా.. అపోలో ఆసుపత్రిలో అమ్మ మరణానికి ముందు ఏం జరిగింది అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. కానీ ఎవరూ దీనిపై మాట్లాడే పరిస్థితుల్లో లేరు.
ఈ నేపథ్యంలో అమ్మ మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన సీనియర్ నటి గౌతమి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక డేరింగ్ లెటర్ రాసింది. అమ్మ మరణంపై ఆమె అనేక ప్రశ్నలు సంధించింది. రెండున్నర నెలలుగా జయలలిత ఆసుపత్రిలో ఉండగా.. ఒక్కసారి కూడా ఆమె ఫొటోను ఎందుకు బయటపెట్టలేదు.. మధ్యలో కోలుకున్నపుడు జయ ఎందుకు జనాలకు కనిపించలేదు.. అంతా బాగుంది అనుకున్నాక ఎందుకు ఉన్నట్లుండి ఆమెకు గుండెపోటు వచ్చింది.. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన జయకు ఇంత విషమ పరిస్థితి ఎందుకు తలెత్తింది.. జయ అసలు ఏ సమయంలో చనిపోయింది.. ఆ సమయంలో ఆసుపత్రిలో ఏం జరిగింది.. జయ బంధువుల్ని కూడా ఎందుకు ఆమెను చూడటానికి అనుమతించలేదు.. లాంటి అనేక ప్రశ్నలు సంధించింది గౌతమి. సగటు పౌరురాలిగా.. జయ అభిమానిగా ఈ ప్రశ్నలు వేస్తున్నానని.. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం సడలకుండా ఉండాలంటే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇవ్వాలని ఆమె విజ్నప్తి చేసింది. ఐతే గౌతమి కేవలం అమ్మపై అభిమానంతోనే ఈ లేఖ రాసిందా.. లేక త్వరలోనే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఆమె ఏదైనా వేరే ప్రయోజనాలు ఆశించి ఇలా చేసిందా అన్నదే డౌటు.