ప‌వ‌న్ విష‌యాన్ని ఆలోచించ‌లేదు.. బండి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2021-08-22 13:22 GMT
తెలంగాణ ప్ర‌తిపక్షం బీజేపీ ఏం చేస్తోంది?  హుజూరాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో ఎలా ఆలోచిస్తోంది? ఇప్పుడు ఈ విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. వాస్త‌వానికి అధికార ప‌పార్టీ టీఆర్ ఎస్‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గం ద‌క్కించుకోవ‌డం కంటే.. బీజేపీకి మాత్రం ఇక్క‌డ పాగావేయ‌డం అత్యంత కీల‌కం. దుబ్బాక‌లో విజ‌యం ద‌క్కాక‌.. బీజేపీ గ్రాఫ్ పెరిగింద‌ని భావించిన క‌మ‌ల నాథుల‌కు సాగ‌ర్‌లో ఎదురు దెబ్బ త‌గిలింది. త‌ర్వాత‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప పోరులో విజ‌యం దక్కించుకోక‌పోతే.. పార్టీ పై తీవ్ర ప్ర‌బావం ప‌డుతుంది.

అయితే.. ఈ క్ర‌మంలో త‌మమిత్ర ప‌క్షం(ఏపీకే ప‌రిమిత‌మైనా) జ‌న‌సేన‌తో క‌లిసి ఇక్క‌డ ప్ర‌చారం చేస్తారా?  లేక ఏం చేస్తారు? అనే విష‌యంపై తెలంగాణ బీజేపీ సార‌థి.. బండి సంజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లే చేశారు.. జనసేన విషయంపై ఏమడిగినా పార్టీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. దీనిని బ‌ట్టి జనసేనతో పొత్తు విషయమై పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనబడలేదు. గ్రేటర్  హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నికల సమయంలో తెలంగాణాలో జనసేనతో బీజేపీకి పొత్తు లేదని మీడియాతోనే చెప్పిన విషయం తెలిసిందే. ఏపిలో జనసేనకు పొత్తుంటే అది ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమన్నారు.  అప్పటి నుండి పవన్ తో తెలంగాణా బీజేపీ నేతలు పెద్దగా భేటీ అయ్యింది లేదు.

త‌ర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మయంలో బీజేపీ త‌మ‌ను మోసం చేసింద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో టీఆర్ ఎస్‌కు మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప‌వ‌న్ ప్ర‌త్య‌క్షంగా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు ప‌రా్టీల మ‌ధ్య పొత్తు విష‌యం గుంభ‌నంగా మారింది. నిజానికి హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థిగా గెలవటం ఈటల రాజేంద‌ర్‌కు ఎంత ముఖ్యమో బీజేపీకి అంతే అవసరం. ఈ దశలో మద్దతు ఇవ్వటానికి ఎవరు ముందుకొచ్చినా తీసుకుంటామని చెప్పాల్సిన బండి పవన్ విషయంలో పెద్దగా ఆసక్తి లేనట్లుగా మాట్లాడ విస్మ‌యానికి గురి చేస్తోంది. గట్టిగా చెప్పాలంటే హుజూరాబాద్ లో బీజేపీకి ప్రత్యేకంగా ఓటు బ్యాంకు లేదు. ఈటలకు పడే ఓట్లన్నీ ఆయన్ను వ్యక్తిగతంగా చూసి పడే ఓట్లే అని అందరికీ తెలిసిందే.

మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటలకు 1 లక్ష చిల్లర ఓట్లొస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కౌశిక్ రెడ్డికి 62 వేల ఓట్లువచ్చాయి. బీజేపీ అభ్యర్థికి అసలు డిపాజిట్లు కూడా రాలేదు. అంటే ఇక్కడ బీజేపీ ఎంత బలంగా ఉందో తెలిసిపోతోంది. ఇలాంటి ఉప ఎన్నికలో మద్దతిస్తామని ఎవరు ముందుకు వచ్చినా, మద్దతు తీసుకునేందుకు ఎవరిని వదులుకోకూడదు. అలాంటిది పవన్ విషయం ఇంకా ఆలోచించలేదని, పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. మ‌రి ఏం జ‌రుగుఉతందో చూడాలి.
Tags:    

Similar News