సంబంధం లేని అంశాల్లో టార్గెట్ కావటం.. అనవసర వివాదాల్లోకి నెట్టేయటం లాంటివి కొందరు ప్రముఖుల విషయాల్లో చోటు చేసుకుంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రివర్యులు మహమూద్ అలీ పరిస్థితి ఇదే తీరులో ఉందని చెబుతున్నారు. ఆ మధ్యన ప్రగతిభవన్ కు వెళ్లిన ఆయన.. ఏదో పనిలో ఉండి సీఎంను కలవకుండా తన కార్యాలయానికి వెళితే.. దానికి మీడియాలో సాగిన రచ్చ అంతా ఇంతా కాదు.
అదొక్కటే కాదు.. కొద్ది రోజలు తర్వాత జరిగిన మంత్రి వర్గ సమావేశానికి అలీ రాలేదన్న ప్రచారంతో పాటు.. కాబినెట్ మీటింగ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ కు హాజరు కాని అంశానికి వినిపించిన ఊహాగానాలకు అంతూపొంతూ లేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో చాలా మంది ప్రముఖులు మీడియాలో కాకున్నా.. సోషల్ మీడియాలో కొందరు అతిగాళ్ల కారణంగా టార్గెట్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం లో మాత్రం తరచూ హోంమంత్రి అలీ పేరు అదే పనిగా తెర మీదకు రావటం గమనార్హం.
ఆదివారం రాత్రి వేళ తన అధికార నివాసంలో కులాశాగా ఉన్న అలీ అస్వస్థతకు గురైనట్లుగా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ.. మీడియా సర్కిళ్లలోనూ ప్రచారం సాగింది. దీంతో.. ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. లక్కీగా.. ఈ తప్పుడు ప్రచారాన్ని నిలువరించటం లో అలీ ఆఫీసు సిబ్బంది సక్సెస్ అయ్యారు.
అధికారులతో కలిసి మీటింగ్ లో ఉన్న ఆయన అనారోగ్యానికి గురైనట్లుగా.. ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా ప్రచారం సాగుతున్న విషయాన్ని తెలుసుకున్న అలీ ఆఫీసు సిబ్బంది షాక్ కు గురైనట్లుగా తెలిసింది. ఈ విష ప్రచారాన్ని ఎవరూ చేస్తున్నారన్న విషయాన్ని తర్వాత చూసుకుందామని భావించిన వారు.. మీడియా సంస్థలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో.. ఈ దరిద్రపుగొట్టు ప్రచారానికి ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంది మంత్రులు ఉంటే.. హోంమంత్రి అలీనే ఎందుకు టార్గెట్ అవుతున్నారన్న చర్చ ఇప్పుడు సాగుతోంది?