వైఎస్ విజయమ్మ మరోసారి వార్తల్లో నిలిచారు. తన భర్త వైఎస్ఆర్ వర్థంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లో సెప్టెంబర్ 2న రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ విజయమ్మ మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాయి. అయితే భర్త వైఎస్ఆర్ మరణం తర్వాత కొడుకు వైఎస్ జగన్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.
వైఎస్ వర్థంతి సందర్భంగా ఆయన ‘కేబినెట్’లోని మాజీ మంత్రులు, నేతలతో వైఎస్ విజయలక్ష్మీ నిర్ణయించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ‘మంత్రివర్గంలోని’ వారిని సగౌరవంగా పిలుపులు వెళుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ సీఎంగా ఉన్నారు. ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెంది ఇతర పార్టీల్లో ఉన్న వారికి కూడా ఈ పిలుపులు వెళుతున్నాయి. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఈ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ మంత్రివర్గంతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన వారికి కూడా ఆహ్వానాలు వెళ్తున్నాయి. వారిలో కేవీపీ రాంచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, డీఎస్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి వంటి వారు ఉన్నారట.. అందరికీ విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ 12వ వర్థంతి సందర్భంగా సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి రావాలని.. వైఎస్ఆర్ మంత్రింలో పనిచేసిన వారిని, సహచరులు, శ్రేయోభిలాషులను ఫోన్ లో విజయమ్మ ఆహ్వానిస్తున్నారు.
వైఎస్ఆర్ చనిపోయిన 12 ఏళ్ల తర్వాత ఈ సమావేశాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడే ఎందుకు పెట్టాలనుకుంటున్నారనే సందేహం అందరిలోనూ వస్తోంది.
ఈ సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా ఇది కూతురు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ వ్యవహారాల్లో విజయలక్ష్మీ కూడా తెరవెనుక చురుకుగా ఉన్నారన్న ప్రచార నేపథ్యంలోనే ఈ భేటి పెట్టినట్టుగా అందరూ అనుమానిస్తున్నారు.
షర్మిల పార్టీలోకి కీలక నేతలు ఎవరూ రావడం లేదు. పార్టీ పెట్టిన కొత్తలో వైఎస్ విజయమ్మ ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ ఆత్మీయ సమావేశం వెనుక రాజకీయం లేదని అనుకోవడానికి వీల్లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఆహ్వానాల్లో ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు.సమావేశం ముగిశాకే దాని ఎజెండా ఏంటనేది తెలియనుంది.