అరే.. ఎలాంటి ముర‌ళీమోహ‌న్ అలా అయ్యారేంటి?

Update: 2019-06-01 11:50 GMT
వేదాంతం కాదు కానీ.. జీవిత స‌త్యం ఒక‌టి ఉంటుంది. చాలామంది చాలాప్లాన్లు వేసుకుంటారు కానీ.. భ‌విష్య‌త్తు కంటే వ‌ర్త‌మానం చాలా ముఖ్య‌మైంది. దాన్ని వ‌దిలేసి ఫ్యూచ‌ర్ క‌ల‌లు క‌నేటోళ్లు చాలామంది క‌నిపిస్తుంటారు. గ‌డుస్తున్న ఈ క్ష‌ణ‌మే నీది. త‌ర్వాతి క్షణంలో ఏమ‌వుతుందో ఎవ‌రికి తెలీద‌న్న మాట‌లు.. ప్ర‌ముఖ సినీన‌టులు క‌మ్ రాజ‌మండ్రి మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ తాజా ప‌రిస్థితి చూస్తే.. అయ్యో అనుకోవాల్సిందే.

మొన్న‌టివ‌ర‌కూ హుషారుగా క‌నిపించిన ఆయ‌న‌.. తాజాగా ఆసుప‌త్రిలో బెడ్ మీద‌.. మాసిన గ‌డ్డంతో.. క‌ళ త‌ప్పిన ముఖంతో క‌నిపించి షాకిస్తున్నారు. ఇంత‌కూ ఆయ‌న‌కు ఏమైందంటే.. ఆశ్చ‌ర్య‌పోయే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌నే ముర‌ళీమోహ‌న్ వెన్నుముక‌కు ఆప‌రేష‌న్ జ‌రిగిన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొన్న‌టి దాకా బాగానే ఉన్న ఆయ‌న‌.. అంత‌లోనే అంత‌లా ఏమైంద‌న్న విష‌యంలోకి వెళితే..

మే 14న వార‌ణాసిలో త‌న త‌ల్లి అస్థిక‌లు క‌లిపేందుకు గంగాన‌దికి వెళ్లారు ముర‌ళీమోహ‌న్. అయితే.. అక్క‌డ రెండు కాళ్ల‌కు స‌మ‌స్య వ‌చ్చింది. అప్ప‌టివ‌ర‌కూ బాగానే ఉన్న ఆయ‌న.. అప్ప‌టిక‌ప్పుడు న‌డ‌వ‌టానికికూడా ఇబ్బంది ప‌డ్డారు. దీంతో ఆయ‌న్ను హుటాహుటిన హైద‌రాబాద్ కు తీసుకొచ్చారు. కేర్ ఆసుప‌త్రిలో జాయిన్ చేశారు.

చెకప్ చేసిన వైద్యులు ఆయ‌న వెన్నుముక‌లోని ఎల్ 4.. ఎల్ 5.. ఎల్ 6 ద‌గ్గ‌రి న‌రాలు ఒత్తిడికి గురి అవుతున్నాయ‌ని.. వెంట‌నే ఆప‌రేష‌న్ చేయాల‌ని చెప్పారు. దీంతో.. ఈ నెల 24న వైద్యుల స‌మ‌క్షంలో ఆయ‌న వెన్నుకు ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయిన‌ట్లు వైద్యులు చెబుతున్నారు. ముర‌ళీమోహ‌న్ కు మేజ‌ర్ స‌ర్జ‌రీ విష‌యం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి స‌తీస‌మేతంగా ఆసుప‌త్రికి వ‌చ్చి.. ఆయ‌న్ను ప‌రామ‌ర్శించారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకున్నారు. ఈ నెల ఏడున ఆయ‌న‌కు కుట్లు తీయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. త‌న‌కు జ‌రిగిన ఆప‌రేష‌న్ విష‌యాన్ని ఒక వీడియో ద్వారా వెల్ల‌డించారు ముర‌ళీమోహ‌న్. తాను త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని.. తాను ఈ నెల 10న రాజ‌మండ్రిలోని స‌న్నిహితులు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు.. అభిమానుల‌ను క‌లుసుకుంటున్నాని పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ అంతా చూసిన‌ప్పుడు జీవిస్తున్న ఈ క్ష‌ణం త‌ప్పించి.. మ‌రుక్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో ఒక ప‌ట్టాన అర్థం చేసుకోలేమ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.


Tags:    

Similar News