ఇన్నాళ్లకు ముసుగు తొలిగింది. కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇంటిలో అమిత్ షా - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సమక్షంలో ఆయన కమలతీర్థం పుచ్చుకున్నారు.
సాధారణంగా పార్టీలో చేరికలన్నీ కార్యాలయాలు - ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చేస్తారు. కానీ అమిత్ షా మాత్రం పీఠాధిపతికి గౌరవానికి భంగం కలుగకుండా ఢిల్లీలోని తన ఇంటిలో పార్టీలోకి చేర్చుకొని తగిన గౌరవాన్ని ఇచ్చారని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.
అయితే పీఠాధిపతి పరిపూర్ణానంద చేరికను అటు ఏపీ - ఇటు తెలంగాణ బీజేపీ నేతలైన రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ - నేతలు కిషన్ రెడ్డి - ఎన్. రామచంద్రరావు - ఎన్వీఎస్ ప్రభాకర్ లు స్వాగతించే ప్రకటనలు చేయకపోవడం గమనార్హం. పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీనిపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు. దీంతో బీజేపీలో చేరి యోగి ఆధిత్యనాథ్ లా రాష్ట్ర పార్టీని లీడ్ చేద్దామని కలలుగంటున్న పరిపూర్ణనందాకు ఏపీ - తెలంగాణ బీజేపీలో ముళ్లబాట ఎదురుకానుందని అర్థమవుతోంది. అయితే ఆశ్చర్యకరంగా తెలంగాణలోని కింది - మధ్యస్థాయి నేతలు - కార్యకర్తలు బయట నుంచి బలమైన పరిపూర్ణనందా స్వామికి మద్దతిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నేతృత్వంలో రాష్ట్ర సీనియర్ నేతలు తెలంగాణలో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేయడానికి ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈరోజు స్వామిజీని అమిత్ షా తెలంగాణ నేతలకు పరిచయం చేయనున్నారని సమాచారం. మరి తమకు పోటీగా వస్తున్న స్వామీజీని తెలంగాణ బీజేపీ నేతలు ఎలా స్వాగతిస్తారో చూడాలి మరి.
కాగా పరిపూర్ణనంద హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. జూబ్లిహిల్స్ లో తెలంగాణలో అత్యంత ప్రాచూర్యం పొందిన నియోజకవర్గం. ఇక్కడ పెద్ద సంఖ్యలో వలసవాదులు - నార్త్ ఇండియన్లు - రాజకీయ నాయకులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నుంచి నిర్మాత బండ్ల గణేష్ వరకూ అందరూ ఇదే నియోజకవర్గం కోరుతున్నారు. ఇప్పుడు తాజాగా స్వామి పరిపూర్ణనందా కూడా ఇక్కడి నుంచే పోటీచేయాలని డిసైడ్ అవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది
ఈ విషయంలో స్వామి స్పష్టంగా చెప్పకున్నా బీజేపీ అధిష్టానం మాత్రం సెటిలర్లు ఉన్న ఇక్కడి నుంచే స్వామిని పోటీచేయించే ఆలోచనలో ఉందని సమాచారం. జూబ్లిహిల్స్ లో చాలామంది పరిపూర్ణ అనుచరులున్నారు. కాకినాడ శ్రీపీఠంతో ఇక్కడి వారికి బలమైన సంబంధాలున్నాయట.. ధనవంతులైన అనేకమంది స్వామి సలహా కోసం తరచూ సందర్శిస్తారట.. అందువల్ల పరిపూర్ణ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్లు తెలిసింది.
పైగా జూబ్లిహిల్స్ లో ఎంఐఎం ప్రాబల్యం కూడా ఉంది. ముస్లిం సంఖ్య కూడా గణనీయమే.. ఎంఐఎంకు జూబ్లిహిల్స్ పరిధిలో రెండు కార్పొరేషన్ డివిజన్లున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ-ముస్లిం మనోభావాలను స్వామి ద్వారా విసిరి ఈ నియోజకవర్గంలో గెలవవచ్చని బీజేపీ భావిస్తోంది.