టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు థ్యాంక్స్ చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్టుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ట్విటర్ ద్వారా బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎందుకీ ధన్యావాదాలు అంటే.. ‘సర్ జీ థ్యాక్స్ ఫర్ నో మోర్ అబ్యూసెస్’ అని పీకే ట్వీట్ చేశారు.
అదే ట్వీట్ లోనే ప్రశాంత్ కిషోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార గీతం కోటి వ్యూస్ ను రీచ్ అయిన విషయాన్ని పేర్కొన్నారు. ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నికల ప్రచార గీతానికి కోటి వ్యూస్ రావడం చాలా గొప్ప అని పీకే ట్వీట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు సీఎం చేయడానికన్నా ముందే.. ఆయనను వారు ఒక రాక్ స్టార్ ను చేశారని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
అందుకు సంబంధించిన యూట్యూబ్ లింక్ ను పోస్టు చేశారు పీకే. అదే ట్వీట్ లో థ్యాంక్స్ అంటూ చంద్రబాబును కూడా గిల్లారు పీకే. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ మీద చంద్రబాబు నాయుడు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పీకే ప్రస్తావన తీసుకు వచ్చారు. పీకేను బిహారీ డెకాయిట్ గా అభివర్ణిస్తూ బాబు తీవ్ర విమర్శలు చేశారు. బాబు విమర్శలు మరిన్ని విమర్శలకు దారి తీశాయి. చంద్రబాబు నాయుడు బిహారీలను అవమానిస్తూ ఉన్నారని పలు ఫిర్యాదులు కూడా దాఖలు అయ్యాయి. పీకేను విమర్శించబోయి బాబు అలా ఇరకాటంలో పడ్డారు. ప్రాంతీయ విద్వేషాలను రేపుతున్నారనే తరహా కంప్లైంట్లు నమోదయ్యే సరికి బాబు మళ్లీ పీకేని అలా విమర్శించలేదు. అందుకే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుకు థ్యాంక్స్ చెప్పినట్టుగా ఉన్నారు!