దక్షిణాఫ్రికా ఇప్పుడు ప్రపంచకప్ క్రికెట్ లో ఓటముల దిశగా సాగుతోంది. గెలువలేక ఆపసోపాలు పడుతోంది. ఎంతో బలంగా ఉన్న ఆ జట్టు వరుస ఓటములతో ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే బలమైన డివీలియర్స్ జట్టులోకి వస్తానని చెప్పినా సౌతాఫ్రికా టీం వద్దన్నదట.. దానికి గల కారణాలను తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫా డుప్లెసిస్ వెల్లడించారు.
దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ సరిగ్గా ప్రపంచకప్ జట్టు ప్రకటనకు ముందు రోజు అంతా సిద్ధమయ్యాక డివీలియర్స్ తనకు ఫోన్ చేసి జట్టులోకి వస్తానని చెప్పాడని.. అంతా సిద్ధమైన వేళ ఆలస్యం అయిపోయిందని చెప్పానని వివరించారు. ఆలస్యంగా స్పందించడం వల్లే డివిలీయిర్స్ ను జట్టులోకి తీసుకోలేదని డుప్లెసిస్ అభిప్రాయపడ్డారు.
అయితే డివిలీయర్న్ తీసుకుందామని కోచ్, సెలెక్టర్లతో మాట్లాడి 99శాతం ఒప్పించే ప్రయత్నం చేశానని డుప్లెసిస్ వివరించారు. అయితే అది వీలుకాకపోవడతో తనతో కూడా మాట్లాడడం డివిలీయర్స్ మానేశాడని డుప్లెసిస్ వివరించాడు.
అయితు ఇప్పుడు సఫారీల జట్టు ఓటమిపై అభిమనులు కలత చెందుతున్నారు. డివిలియర్స్ జట్టులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని.. డివిలీయర్స్ ను ఎందుకు తీసుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే కెప్టెన్ డుప్లెసిస్ అసలు సంగతిని తెలిపి విమర్శకుల నోళ్లు మూయించాడు.