కీ బోర్డు.. అంటే ఏమిటో ఎల్ కేజీ పిల్లాడి నుంచి తాతయ్య దాకా తెలుసు. ప్రస్తుతం సాంకేతికత అంతలా అందుబాటులోకి వచ్చిందన్నమాట. టైపింగ్ అంటే కేవలం డెస్క్ టాప్, ల్యాప్ టాప్, ట్యాబ్ లో చేసేదే కాదు. నిత్యం వాడుతున్న సెల్ ఫోన్ లోనూ టైప్ చేస్తుంటాం. ఈ టైపింగ్ లోనూ రకరకాలు ఉంటాయి. వాటికి ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. ఇకపోతే సెల్ ఫోన్ టైప్ చేయడానికి ఎవరూ ఇతర సాయం తీసుకోరు. వాడకాన్ని బట్టి అదే వస్తుంటుంది. మిగతా వాటికి అయితే కాస్త ప్రాక్టీసు అవసరం. ఇక ప్రత్యేక తర్ఫీదు కోసం శిక్షణ అవసరం. అయితే ఫోన్, ల్యాప్ టాప్, కీబోర్డు అన్నింటిల్లోనూ కీస్ అమరిక ఒకే విధంగా ఉంటుంది. ఏబీసీడీ.. ఆంగ్ల వర్ణమాల క్రమంగా ఉండదు. ఇలా ఎందుకు ఉండదు అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? అసలు అల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం. కీబోర్డు లెటర్స్ అమరిక గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
కీబోర్డులో కీస్ అమరిక నిర్దిష్టంగా ఉంటుంది. ఏ కీబోర్డులోనైనా Q, W, E, R, T, Y, U, I, O, P లెటర్స్ ఉంటాయి. వాటిని చదవడం కోసం ఈ లెటర్స్ అన్నింటిని ఒకేసారి చదువుతాం. అయితే ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ అనే ఆయన తయారు చేశారు. దీనికి ముందు మనం తొలుత చెప్పుకున్న విధంగా ఆంగ్ల వర్ణమాల క్రమంలో కీస్ అమరిక ఉండేది. అప్పుడు తలెత్తిన కొన్ని సమస్యల వల్ల కీస్ అమరికపై పరిశోధనలు చేశారు. అయితే టైపింగ్ లో ఉన్న అసౌకర్యం దృష్ట్యా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు మనం వాడుతున్న విధంగా లెటర్స్ ను సమకూర్చారు.
కీబోర్డు ఉపయోగంలో వచ్చిన ఇబ్బందుల వల్లనే లెటర్స్ అమరిక అనేది మారిపోయింది. ఇందులో అసౌకర్యం ఏంటి.. ఫాస్ట్ గా టైప్ చేస్తే సరి అనుకుంటున్నారా? అంటే మనం ఇంగ్లీష్ లో వాక్యాలు, పదాలు వంటివి రాసేటప్పుడు కొన్ని లెటర్స్ ఎక్కువగా వాడుతాం. ఇంకా కొన్ని తక్కువ. మరికొన్ని అయితే చాలా అరుదు. ఆంగ్ల వర్ణమాలలోని అచ్చులు A,E,I,O,U అంతేకాకుండా హల్లులు P, B, L, M, N, K, L చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇకపోతే Q, Z W, X కీస్ ను చాలా అరుదుగా వినియోగిస్తాం. దీనిని దృష్టిలో ఉంచుకొని Qwerty నమూనాలో షోల్స్ ఈ తరహా కీబోర్డును రూపొందించారట.
ఇంగ్లీష్ మాత్రమే కాదు ఇతర భాషలో టైపింగ్ కు కూడా ఏ పదాలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయో పరిశోధనలు చేశారట. అనంతరం చేతి వేళ్లకు సౌకర్యంగా ఉండేలా వాటిని నిర్దిష్ట స్థానాల్లో అమర్చారు. ఈ ఫార్మాట్ లో కీస్ ఉండడం వల్ల చేతివేళ్లకు ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుందట. అంతేకాకుండా టైపింగ్ కూడా చాలా వేగంగా చేయడానికి ఈ అమరిక ఉపయోగపడుతుందని షోల్స్ గతంలో వివరించారట. ఆ తర్వాత పలు పరిశోధనలు చేసి.. నిపుణులు అంగీకరించిన తర్వాతే వినియోగదారులకు టైపింగ్ మరింత సులువుగా ఉండే కీబోర్డు అనగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న కీబోర్డును ఆమోదించారట. ఆ విధంగా ఈ కీబోర్డును అందరూ ఉపయోగిస్తున్నారు.