రూ.10ల‌క్ష‌లు లంచం తీసుకున్న ఎమ్మెల్యే.. తిప్పి పంపించిన జ‌గ‌న్‌!

Update: 2019-07-09 09:11 GMT
మాట‌లు చెప్ప‌టం వేరు. చెప్పిన మాట మీద నిల‌బ‌డ‌టం అంత తేలికైన విష‌యం కాదు. అవినీతి.. అక్ర‌మాల విష‌యంలో తాను క‌చ్ఛితంగా ఉంటాన‌ని.. ఎవ‌రిని ఉపేక్షించ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. తాజాగా అదే మాట మీద నిలిచారు.  ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒక‌రు తాజాగా క‌క్కుర్తి ప‌డ్డారు. బ‌దిలీ కోసం ఒక పోలీసు అధికారి ద‌గ్గ‌ర నుంచి రూ.10ల‌క్ష‌లు తీసుకున్నారు.

ఈ వ్య‌వ‌హారం సీఎం జ‌గ‌న్ దృష్టికి వెళ్లింది. వెంట‌నే రియాక్ట్ అయిన ఆయ‌న స‌ద‌రు ఎమ్మెల్యేను త‌న వ‌ద్ద‌కు పిలిపించారు. పోలీసు అధికారి బ‌దిలీ కోసం తీసుకున్న రూ.10ల‌క్ష‌ల మొత్తం గురించి నేరుగా ప్ర‌స్తావించ‌టంతో స‌ద‌రు ఎమ్మెల్యే త‌త్త‌ర‌పాటుకు గురైన‌ట్లుగా తెలుస్తోంది.

అవినీతి విష‌యంలో తాను ఎలాంటి త‌ప్పుల్ని క్ష‌మించ‌నంటూ ఆగ్ర‌హంతో జ‌గ‌న్ తీరుతో భ‌య‌ప‌డిపోయిన ఎమ్మెల్యే.. తాను తీసుకున్న రూ.10ల‌క్ష‌ల మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తాన‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. జ‌గ‌న్ ఆగ్ర‌హాన్ని నేరుగా చూసిన స‌ద‌రు ఎమ్మెల్యే.. బ‌తుకు జీవుడా అని బ‌య‌ట‌ప‌డి.. స‌ద‌రు పోలీసు అధికారి ద‌గ్గ‌ర తాను తీసుకున్న రూ.10ల‌క్ష‌లు వెన‌క్కి ఇచ్చేసిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు ప్ర‌జాప్ర‌తినిధుల‌పై వ‌చ్చే ఆరోప‌ణ‌ల్ని ప‌ట్టించుకోర‌న్న పేరుంది.   

రాజ‌ధాని డిజైన్ల కోసం బాబు పిలిచిన జ‌పాన్ సంస్థ ఏపీలో ఉన్నంత అవినీతి భార‌త‌దేశంలో మ‌రెక్క‌డా లేద‌ని వ్యాఖ్యానించ‌ట‌మే కాదు.. అడుగ‌డుగునా ఈ లంచాలేందిరా బాబు అంటూ ఒక లేఖ రాసి త‌మ దారిన తాము పోవ‌టం తెలిసిందే. ఇలా.. బాబు పాల‌న‌కు.. జ‌గ‌న్ పాల‌న‌కు ఏ మాత్రం పోలిక లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


    
    
    

Tags:    

Similar News