భర్త వీర్యంపై పూర్తి హక్కు భార్యకే .. కోర్టు కీలక తీర్పు!

Update: 2021-01-22 10:21 GMT
ఓ మరణించిన వ్యక్తి వీర్యంపై ఆ మృతుడి భార్యకి మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయని కోల్ ‌కతా హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. భార్య కాకుండా ఇతరులు ఎవరైనా దానిపై హక్కులు పొందాలంటే.. తప్పనిసరిగా ఆ భార్య అనుమతి తీసుకోవాల్సిందే అని వెల్లడించింది.   చనిపోయిన తన కుమారుడి వీర్యం కోసం తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ‌ను కొట్టివేసింది. అరుదైన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ...

కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి 2015లో ఢిల్లీకి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అతడు అప్పటికే తలసేమియాతో బాధపడుతుండేవాడు. ఢిల్లీ ఆస్పత్రిలో ఇందుకు సంబంధించి చికిత్స తీసుకునేవాడు. 2018లో అతడు మరణించాడు. అయితే ,మరణానికి ముందే ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో అతడి వీర్యాన్ని భద్రపరిచాడు. 2020 మార్చిలో ఆ వ్యక్తి తండ్రి స్పెర్మ్‌ బ్యాంకును సంప్రదించాడు. అక్కడ భద్రపరిచిన చనిపోయిన తన కుమారుడి తాలూకూ వీర్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు స్పెర్మ్ బ్యాంక్ నిరాకరించింది. కుమారుడి వీర్యాన్ని అతడి భార్యకు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది.

ఆ వీర్యాన్ని అతడి భార్య గర్భం దాల్చడానికి ఉపయోగించాలన్నా, లేదా వేరే వాళ్ల కోసం వాడాలనుకున్నా, పడేయాలనుకున్నా.. అది కేవలం భార్య అనుమతితోటే సాధ్యమవుతుందని తేల్చి చెప్పింది. దీనితో ఆ తండ్రి తమ కోడలి నుంచి వీర్యం విషయమై నో‌ అబ్జెక్షన్‌ లెటర్‌ ఇవ్వవల్సిందిగా కోరాడు. అందుకు ఆమె తిరస్కరించింది. ఈ పరిణామంతో చేసేదేంలేక ఆయన కోల్ ‌కతా కోర్టును ఆశ్రయించాడు. తమ కొడుకు వీర్యాన్ని కోడలు తమకు దక్కకుండా చేస్తోందంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ వీర్యం ధ్వంసమైనా, లేదా నిరుపయోగమైనా తమ వంశం నాశనం అవుతుందని పిటిషన్‌ లో కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు ను వెల్లడించింది.
Tags:    

Similar News