భార్య-భర్త గొడవ.. భార్యను కోర్టు ప్రాంగణంలోనే చితకబాదిన లాయర్
ఆమె మహిళ. భర్తతో గొడవపడి.. కోర్టుకు ఎక్కి.. పుట్టెడు దుఖంలో ఉంది. జీవిత కాల ఆసరా కోసం.. ఆమె భరణం కోరుతూ.. కోర్టు మెట్లు ఎక్కింది. ఇక్కడ ఏమైందో ఏమో.. తెలియదు కానీ, భర్త తరఫున లాయర్.. ఏకంగా.. ఆమెపైనే విరుచుకుపడ్డాడు. ఇష్టం వచ్చినట్టు ఉరికించి ఉరికించి మరీ చితకబాదాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారు `అయ్యో..` అని అనకుండా ఉండలేక పోతున్నారు.
వివరాలు..
ఓ కేసులో మహిళ తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఓ న్యాయవాది ఆమెను వెంటపడి మరీ దాడి చేశాడు. భరణం కోసం ఓ మహిళ.. భర్త మీద కేసు వేయగా.. ఆ భర్త తరపు వాదిస్తున్న న్యాయవాది ఆమెను పరిగెత్తించి మరీ కోర్టు ప్రాంగణంలోనే చితకబాదాడు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పడు వైరల్ అవుతోంది.
భారతి పటేల్(23) అనే ఆవిడ.. తన భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో.. విడాకుల భరణం కోసం ఆమె బియోహరి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ఆ భర్త తరపున అడ్వొకేట్ భగవాన్ సింగ్(58) వాదిస్తున్నారు. అయితే పిటిషన్ వాదనలకు హాజరైన భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందట. ఈ క్రమంలో ఆమె తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఆ లాయర్ వెంటపడి మరీ దాడి చేశాడు.
భగవాన్, భారతి పటేల్ వెంట పడుతూ కోర్టు సముదాయంలోనే చితకబాదాడు. అక్కడే కొందరు ఉన్నా చూస్తూ ఉండిపోయారే తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గురువారం ఈ ఘటన జరిగిందని, బాధితురాలి ఫిర్యాదు మేరకు భగవాన్ సింగ్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
ఇక ఈ దాడి విషయం తమ దృష్టికి రాలేదని, వస్తే చర్యలు తీసుకుంటామని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రాకేష్ సింగ్ బాఘెల్ తెలిపారు. ఇదిలావుంటే.. నెటిజన్లు మాత్రం సదరు లాయర్‌పై విరుచుకుపడుతున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి.. బాధ్యతాయుతమైన లాయర్‌గా ఉండి.. ఒక అబలపై ఇలా చేయి చేసుకోవడం ఏంటని.. నిప్పులు చెరుగుతున్నారు.

Shameful...
— Subham Anand (@anand_subham1) May 6, 2022
Lawyer ran and beat woman in Shahdol court premises, woman's child kept crying on the ground@dmshahdol @unwomenindia #tajinderbagga #TeJran #JanhitMeinJaari #bangalorerains pic.twitter.com/uEWPQhrmHj