వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజేపై అనూహ్యమైన వార్త ఒకటి తెరమీదకు వచ్చింది. ఐదేళ్లుగా లండన్‌లోని యురోపియన్ ఎంబసీలో అసాంజే ఉంటున్న విషయం తెలిసిందే. ఇలా ప్రత్యేక జీవన విధానం గడుపుతున్న అసాంజే ప్రముఖ సెక్సీ స్టార్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. బేవాచ్ స్టార్ పమేలా ఆండర్సన్‌తో అసాంజ్ డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రహస్య జీవితం గడుపుతున్న సమయంలో ఐదుసార్లు ఆయనను కలవడానికి పమేలా వెళ్లినట్లు డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది. అసాంజేను కలవడానికి వెళ్లిన ప్రతిసారి పమేలా.. కళ్లు చెదిరే డ్రెస్సులు వేసుకొనేదని ఓ రాజకీయ నేత మీడియాతో చెప్పడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
లండన్ రాయబార కార్యాలయంలో ఉన్న అసాంజేను ఆండర్సన్ తొలిసారి 2014 సెప్టెంబర్‌లో కలుసుకున్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళా బాధితుల కోసం పోరాడేందుకు తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు మద్దతు తెలుపాల్సిందిగా అడగడానికి పమేలా ఆయనతో భేటీ అయింది. అనంతరం 2016 అక్టోబర్, నవంబర్లలో ఒక్కోసారి, డిసెంబర్లో రెండుసార్లు అసాంజ్‌ను ఆమె కలిసింది. స్వీడన్లో ఉంటూ అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న అసాంజే.. 2012లో లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదోచుకోవడానికి అభ్యర్థించారు. అనంతరం యూరోపియన్ యూనియన్‌కు చెందిన రాయబార కార్యాలయంలో లండన్‌లో తలదాల్చుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/