ఈసారి ఇంకాస్త గట్టిగా చెప్పిన అమెరికా!

Update: 2016-10-24 04:10 GMT
మనిషోకామట, గొడ్డుకో దెబ్బ అన్నారు... ఈ లెక్కన చూసుకుంటే ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్ కు ఎన్నిసార్లు మంచిగా చెప్పినా, కాసేపు భారత్ సంగతి పక్కనపెడితే... అమెరికా ఎన్నిసార్లు మొత్తుకున్నా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తోంది పాక్. సరికదా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశంలో భారత్ మాహవ హక్కులను ఉల్లంగిస్తోందని పాటపడుతూ ఉంటుందని భారత్ పై బురదజల్లుతూ ఉంటుంది. పాకిస్థాన్ మాత్రం తమ అప్రకటిత సైన్యం అయిన ఉగ్రవాదులను మాత్రం అన్ని రకాలుగానూ పెంచిపోషిస్తోంది. అయితే ఈ విషయంలో పాకిస్థాన్ ను మరోసారి తీవ్రంగా హెచ్చరించింది అమెరికా.

ఈ విషయాలపై ఉగ్రవాదానికి ఆర్ధిక మద్దతును అడ్డుకునే అంశంలో అండర్ సెక్రటరీగా ఉన్న ఆడమ్ జుబిన్ పాక్ పై ఘాటువ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ ప్రభుత్వంలో మూడు బలమైన వ్యవస్థలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఐఎస్ఐ... ఇది పాకిస్థాన్‌ లో క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నది. కొన్ని ఉగ్రవాద గ్రుపుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ, వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని అన్నారు. అనంతరం కాస్త సీరియస్ గా డోసు పెంచిన ఆయన... "ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతును అడ్డుకునే అంశంలో పాకిస్థాన్ కు సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదని చెబుతూ... ఈ ఉగ్రవాద నెట్‌ వర్క్‌ లను ధ్వంసం చేయడానికి అమెరికా కూడా స్వయంగా రంగంలోకి దిగడానికి ఏమాత్రం వెనుకాడబోదని, అవసరమైతే తామే స్వయంగా ఉగ్రవాద గ్రూపుల భరతం పడతామని స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News