ఆఫ్ఘన్ ప్రజలు ఆ దైర్యం చేస్తారా ?

Update: 2021-08-30 04:36 GMT
తాలిబన్..  ప్రపంచవ్యాప్తంగా ఈ పదం ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది. గతంలో తాలిబన్ అంటే తెలియని వారు సైతం, ప్రస్తుతం తాలిబన్ అంటే ఎవరో చెప్పేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా సాయంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మిలిటెంట్ ముఠా. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబన్ శకం మొదలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా తాలిబన్లపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. మొదటి శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పిన తాలిబన్లు, నేరాలు, అవినీతి అరికడతామని చెప్పిన తాలిబన్లు పరిపాలనలోకి వచ్చిన తరువాత తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు ఇస్లామిక్ పాలన పేరిట షరియా చట్టాన్ని అమలు చేశారు. ఆటవిక చట్టాలను తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. హంతకులను, వివాహేతర సంబంధాలను కు పాల్పడిన స్త్రీ, పురుషులను బహిరంగంగా తలలు నరికి శిక్షించారు.

ఇప్పుడు మళ్లీ ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో మళ్లీ ఆ నియమాలు అమల్లోకి తీసుకువచ్చి అందరిని నానా కష్టాలు పెడతారని ఆఫ్ఘన్ ప్రజలు భయపడుతున్నారు. అయితే , తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మరో అంశం వైరల్ అవుతుంది. అదేమిటి అంటే .. తాలిబాన్ల‌కు భ‌య‌ప‌డుతున్న ప్ర‌జ‌లు ఎదురు తిరిగేందుకు సిద్ధ‌మ‌య్యారా , తాలిబన్ లని ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌లు రెడీ అవుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనితో తాలిబన్లు మరో వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. సంక్షోభ సమయంలో చేజిక్కించుకున్న ప్రభుత్వ ఆస్తులు, ఆయుధాలు, వాహనాలు, మందుగుండు సామగ్రిని వారంలోగా తమకు అప్పగించాలని ఆదేశించారు. లేదంటే చట్టపర చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అయితే , చాలామంది ప్రజలు తాలిబన్ల పై తిరుగుబాటుకు సిద్దమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాలిబన్ల దెబ్బకి  అష్రఫ్ ఘనీ తాలిబ‌న్ల దెబ్బ‌తో పారిపోయాడు. ఈ క్ర‌మంలో ఆఫ్గాన్ తాలిబన్ల అధీనంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రక్షణ, భద్రత కరవైన ప్ర‌జ‌లు ప్రభుత్వ ఆస్తులను లూటీ చేశారు. అదేస‌మ‌యంలో త‌మ ప్రాణ ర‌క్ష‌ణ కోసం ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా ఇతరత్రా ఎత్తుకెళ్లారు. ఇప్పుడు ఇదే తాలిబ‌న్ల‌కు పెద్ద సమస్యగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ఎదిరించ‌డ‌మే త‌ప్ప‌,త‌మ‌ను ఎదిరించే వారు లేరు. అయితే, ఇప్పుడు ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల వ‌ద్ద ప్ర‌భుత్వ ఆయుధాలు ఉండ‌డంతో తాలిబ‌న్లు కొంచెం సందిగ్ధం లో పడ్డారు. కాబుల్లోని ప్రజల కోసం ఓ ప్రకటన. వాహనాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర ప్రభుత్వ ఆస్తులు కలిగి ఉన్న వారంతా.. సంబంధిత శాఖలు, కార్యాలయాలకు వాటిని అప్పగించాలి. చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవాలంటే.. వారంలోగా పని పూర్తిచేయాలి  అని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కీలక ప్రకటన చేశారు.

ఆఫ్ఘన్ లో తాలిబన్ల రాజ్యం ఏర్పాటు అయిన తర్వాత కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పేలుళ్లు, తొక్కిసలాటలు, కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు 200 మందికిపైగా కన్నుమూశారు. యుద్ధం ముగిసింది, ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్లు ప్రకటించినా  మహిళల్ని వేధిస్తున్నారని, హజారా వర్గంపై దాడులు చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆఫ్గాన్ లో  నెలకొన్న రాజకీయ సంక్షోభంతో  వచ్చే 4 నెలల్లో 5 లక్షలకుపైగా ఆఫ్గాన్ ప్రజలు దేశం విడిచివెళ్లిపోతారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ అంచనా వేసింది.

ఆఫ్ఘనిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించుకున్న తరువాత.. తాలిబన్లు ఎక్కడా గానీ దాడులకు దిగలేదు. అమెరికా చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారానికి కూడా దిగలేదు. ఈ డ్రోన్ దాడులు ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నవి కావడం వల్ల ఆ అంశాన్ని తాలిబన్లు చూసీచూడనట్టు వ్యవహరిస్తోన్నారు. తమ దృష్టి మొత్తాన్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే కేంద్రీకరించారు. అలాంటి తాలిబన్లు, కొత్తగా మరో దాడికి సమాయాత్తమౌతున్నారు. తమకు కొరుకుడు పడని పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై దాడి చేయడానికి తాలిబన్లు సమాయాత్తమౌతోన్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా  ఆ ప్రావిన్స్‌ తో బాహ్య ప్రపంచానికి ఉన్న సంబంధాన్ని తెంచేశారు తాలిబన్లు. ఇంటర్నెట్, టెలిఫోన్, సెల్, మెసేజ్ వంటి అన్ని రకాల కనెక్టివిటీని స్తంభింపజేశారు. కమ్యూనికేషన్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల పంజ్‌షీర్ ప్రావిన్స్‌ లో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News