ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు తనను ఇందిరా గాంధీ మాదిరి చంపేస్తారన్నారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీ కారణంగా ఏదో ఒక రోజు తాను ఇందిరాగాంధీ మాదిరి హత్యకు గురి అవుతానన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరహాలోనే నా వ్యక్తిగత భద్రతా సిబ్బందే నన్ను హత్య చేస్తారు.. బీజేపీ వారి చేత ఈ పని చేయిస్తుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో కేజ్రీవాల్ మీద పలుమార్లు దాడులు జరగటం.. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఢిల్లీ సీఎం మీద దాడి జరగటం తెలిసిందే.
ఢిల్లీ ముఖ్యమంత్రి చెబుతున్న మాటల ప్రకారం చూస్తే.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై తొమ్మిదో సారి దాడి జరిగిందన్నారు. 2014లో వారణాసిలో మోడీపై తాను పోటీ చేసిన సమయంలో కొందరు దుండగులు దాడి చేశారని.. అదంతా బీజేపీ పుణ్యమేనని ఆరోపించారు. ఇప్పటివరకూ చేసిన ఆరోపణలకు భిన్నంగా..నేరుగా తనను హత్య చేస్తారన్న మాట కేజ్రీవాల్ నోటి నుంచి రావటం చర్చనీయాంశంగా మారింది.