ఏపీలో ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. తనకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని, రాష్ట్రంలో కాషాయ జెండాను రెపరెపలాడించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతిన్న టీడీపీని తనవైపు మ ళ్లించుకునేందుకు వీలుగా కమల నాధులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగానే వారు తమ గళాన్ని సవ రించుకున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రతిపక్షం ఏదైనా ఉంటే అది బీజేపీనే. దీంతో వీరు గత కొద్ది రోజులుగా టీడీపీని వెనుకేసుకు వస్తూ.. వైసీపీని ఎండగడుతున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీ క్షిం చాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు నెత్తిన పాలు పోశారు కమలనాథులు.
ఇక, ప్రజావేదికను జగన్ కూల్చివేయడాన్ని కూడా పూర్తిగా తప్పుబట్టారు. దీనిపై రాష్ట్ర, జాతీయ స్థాయిలోని బీజేపీ నా యకులు నిత్యం ఏదో ఒక ప్రకటన చేస్తున్నారు. ప్రజావేదికను అలానే ఉంచి.. వేరే కార్యక్రమాలకు వినియోగించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక, పోలవరం విషయంలోనూ రాష్ట్రమే నిర్మించుకోవాలని చెప్పడం ద్వారా .. గతంలో తామే స్వయంగా ఈ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించామనే వాదనను వారు బలపరుస్తున్నారు.
ఈ క్రమంలో గత చంద్రబాబు పాలనను బీజేపీ పరోక్షంగా సమర్ధిస్తున్నట్టుగానే అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కాలంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా టీడీపీని వెనుకేసుకు వస్తున్నట్టుగానే వ్యాఖ్యలు సంధిస్తు న్నారు. ఇక, మిగిలిన నాయకులు మాత్రమే ఒకింత అటు ఇటుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనిని ఇప్పటికే కమల నాథులు ప్రారంభించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను కాస్త లోతుగా పరిశీలిస్తే.. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు పునాదులు పడుతున్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా మిత్రపక్షంగానే 2024లో జరిగే ఎన్నికలకు వెళ్లాలని కమలదళం నిర్ణయించు కున్నట్టు కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇలా బాబు అనుకూల.. జగన్ ప్రతికూల వ్యాఖ్యలతో బీజేపీ నేతలు బిజీ అయ్యారని అంటున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. అవకాశం-అవసరమే.. పార్టీలను, నాయకులను నడిపిస్తాయనేది మరోమారు రుజువు కానుందని అంటున్నారు పరిశీలకులు.