ఈ దెబ్బ‌తో ఢిల్లీ ఖాళీ అవుతుందా..?

Update: 2019-11-04 10:33 GMT
దేశ‌రాజ‌ధాని ఢిల్లీకి భూకంపం ముప్పు పొంచి ఉంద‌ని అప్పుడెప్పుడో వార్త‌లు వ‌చ్చాయి. అయినా ప్ర‌జ‌లు లైట్ తీసుకున్నారు. ఆ.. ఎప్పుడొస్తుందో తెలియ‌ని భూకంపం కోసం ఇప్పుడే ఆందోళ‌న ప‌డ‌డం ఎందుకులే అనుకున్నారు. అయితే, ఇప్పుడు భూకంపానికి మించిన భ‌యంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఒణికి పొతున్నారు. ఇక‌, ఢిల్లీలో ఉండ‌లేం బాబూ.. మా దారి మేం చూసుకుంటాం.. అంటూ గ‌గ్గొలు పెడుతున్నారు. మ‌రి.. భూకంపాన్ని మించిన భ‌యం వారిలో ఇప్పుడు ఎందుకు క‌లిగింది? అస‌లు ఏం జ‌రిగింది?  ఇప్పుడు ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ ఉదంతం ఏంటంటే.. వాయు కాలుష్యం. ముఖ్యంగా శీతాకా లంలో దేశ‌రాజ‌ధాని పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకోవ‌డం ఇప్పుడు కొత్త‌కాదు.

అయినా కూడా.. ఇప్పుడే ఎందుకు ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారంటే.. గ‌డిచిన యాభై ఏళ్ల‌లో ఎన్న‌డూ లేనంత‌గా ఇప్పుడు ఢిల్లీని వాయు కాలుష్యం క‌మ్మేసింది. మొన్న దీపావ‌ళి నాటి నుంచి కాలుష్యం మ‌రింత‌గా పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు, వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు ఇక్క‌డ జీవిస్తున్నారు. వివిధ ఉద్యోగాలు చేసుకునే వారి శాతం కూడా ఎక్కువే.దీంతో ఇక్క‌డ జ‌నాభా, జ‌న సాంద్ర‌త కూడా ఎక్కువ‌గానే ఉంటోంది. 75శాతం మంది ప్ర‌జ‌ల‌కు కార్లు, ఇత‌ర వాహ‌నాలు ఉన్నాయి. వీటికి ప్ర‌భుత్వ వాహ‌నాలు కూడా తోడ‌య్యాయి. దీంతో కార్బ‌న్ మోనాక్సైడ్ ఉద్గారాలు పెరిగిపోయాయి.

ఫ‌లితంగా నేడు ఢిల్లీలో వాయు కాలుష్యం భారీ ఎత్తున పెరిగిపోయింది. కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు మాస్క్‌లు ధరించడంతో పాటు ఎయిర్‌ ఫ్యూరిఫైర్లను వాడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఫ‌లితాలు మాత్రం ఆశించిన విధంగా ఉండ‌డం లేదు. దీంతో ప్ర‌జ‌లు అసలు ఇక్క‌డ నుంచి వ‌ల‌స పోతామ‌ని చెబుతున్నారు. 40 శాతం మంది ఇతర నగరాలకు తరలిపోవాలని భావిస్తున్నట్టు తాజా అథ్యయనం స్పష్టం చేసింది. కాలుష్యం కోరలు చాస్తున్నా తమకు మరో మార్గం లేదని, ఇక్కడే సర్ధుకుపోవాలని 13 శాతం మంది వెల్లడించారు.

17,000 మందికి పైగా రాజధాని వాసులను ఈ సర్వే పలుకరించగా 40 శాతం మంది కాలుష్య తీవ్రతతో విసిగిపోయామని, పలు వ్యాధులు తమను చుట్టుముడుతున్నాయని తేల్చిచెప్పారు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం నుంచి వేరొక నగరానికి వెళ్లే దిశగా యోచిస్తున్నామని వారు చెప్పుకొచ్చారు. ఇదే జ‌రిగితే.. రాజ‌ధాని ఢిల్లీ స‌గానికి స‌గం ఖాళీ కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ప్ర‌భుత్వం కూడా ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు ప్రారంభించింది. స‌రి-బేసి సంఖ్యల విధానంలో మాత్ర‌మే రోడ్ల‌పై వాహ‌నాల‌నుఅనుమ‌తిస్తున్నారు. అయినా కూడా కాలుష్యం ఇప్ప‌ట్లో క‌ట్ట‌డి అయ్యే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News