వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని జగన్ భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దాని కోసం ఆయన అనేక రకాలైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎటు నుంచి ఏది జరిగినా తాను అనుకున్న లక్ష్యాన్ని ఆయన చేరుకోవాలని చూస్తున్నారు. ఈ విషయంలో అవసరం అయితే బిగ్ రిస్క్ ని కూడా ఫేస్ చేయడానికి జగన్ రెడీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే ఇపుడు వైసీపీలో ఎమ్మెల్యేలను కలవరపెడుతోంది అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ పట్ల ఉన్న జనాదరణ, ప్రభుత్వ కార్యక్రమాల తీరు తెన్నులు, ప్రజలు ప్రభుత్వం పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నారు వంటి అంశాల మీద జగన్ ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తూ వాటి నివేదికలను దగ్గరపెట్టుని సునిసితంగా పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది. అయితే ఇటీవల పొలిటికల్ స్ట్రాటజిక్ కన్సల్టెన్సీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐ-ప్యాక్ నిర్వహించిన తాజా సర్వే నుంచి జగన్ కి ఆశ్చర్యపోయే విధంగా ఫీడ్ బ్యాక్ వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆ ఫీడ్ బ్యాక్ లో చూస్తే జగన్ కానీ పార్టీ పెద్దలు కానీ ఊహించని విధంగా ఎమ్మెల్యేల పనితీరు పట్ల నియోజకవర్గాలలో అవినీతి పట్ల పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉందని తేలిందట. అయితే ఏపీలో వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న పధకాల పట్ల జనల్లో పెద్దగా వ్యతిరేకత లేదని అంటున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యేల పనితీరు మాత్రం దారుణంగా ఉందని నివేదిక వెల్లడిస్తోంది అంటున్నారు.
దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల పనితీరు. ఆయా చోట్ల ఉన్న ఎమ్మెల్యేల పనితీరు, వారి బలాలు, బలహీనతల మీద కూడా ఇ ప్యాక్ సర్వే చేసినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో ఫీడ్ బ్యాక్ ఇచ్చిన అదే సర్వే విపక్షాల అభ్యర్ధులకు ఎక్కడెక్కడ గ్రాఫ్ పెరిగింది అన్నది కూడా పూసగుచ్చినట్లుగా వివరించింది అని అంటున్నారు.
ఇక చూస్తే చాలా చోట్ల అనేక నియోజకవర్గాలలో వైసీపీలో వర్గ పోరు ఎక్కువగా ఉందని ఐ ప్యాక్ బృందం సర్వేలో తేలిందని అంటున్నారు. దీని వల్ల పార్టీ విజయావకాశాల మీద పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది అని అంతున్నారు. అదే విధంగా గతంతో పోలిస్తే టీడీపీకి ఒక పార్టీగా ఏపీలో ఎంతవరకూ బలం పెరిగింది అన్నది కూడా సర్వే ద్వారా జగన్ వివరాలు తెప్పించుకున్నారని అంటున్నారు.
ఇక ఒక్క ఐ ప్యాక్ సర్వేతో పాటుగా ఇతర ఏజెన్సీల ద్వారా కూడా నివేదికలను వైసీపీ హై కమాండ్ సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే, వివిధ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలతో వైసీపీ పెద్దలు నేరుగా ఇంటరాక్ట్ అవుతూ కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు అని తెలుస్తోంది.
ఇలా తమ వద్దకు వచ్చిన సమాచారాన్ని ఐ ప్యక్ సర్వేతో సరిపోల్చుకుని ఒక సమగ్రమైన అధ్యయనం చేస్తున్నారు అని తెలుస్తోంది. అలాగే టీడీపీలో అంతర్గత విభేదాలు ఉంటే ఎక్కడ ఉన్నాయి. నాయకుల మధ్య ఎక్కడైనా విభేదాలు ఉంటే ఆ వివరాలు కూడా సర్వే ద్వారా జగన్ తెప్పించుకున్నట్లుగా చెబుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారాలను అధ్యయనం చేసిన మీదట కచ్చితంగా మళ్ళీ ఎన్నికల్లో వైసీపీ గెలవాలంటే కనీసం 60 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ముఖాలు రావాలని ఐ ప్యాక్ బృందం సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంగా అందుతోంది. అయితే ఐ ప్యాక్ సర్వేతో పాటు మిగిలినవి కూడా క్రోడీకరించుకున్న మీదటనే ఎమ్మెల్యేలను మార్చే విషయంలో హై కమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు. ఇందులో యాభై శాతం పైగా మార్చడం అంటే భారీ సాహసానికి దిగుతున్నట్లే. మరి ఆ పని జగన్ చేస్తారా. చేస్తే వచ్చే అనుకూలతలు పక్కన పెడితే ప్రతికూలతలను ఎలా తట్టుకుంటారు అన్నది కూడా ఇపుడు కీలకమిన విషయంగా ఉంది.
అయితే ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను మార్చడానికి బదులుగా వారికే మరికొంత గడువు ఇచ్చి పనితీరుని మెరుగుపరచుకోవాలని జగన్ సూచించవచ్చు అని కూడా అంటున్నారు. అప్పటికీ తీరు మారకపోతే మాత్రం భారీ రిస్క్ వైపే జగన్ మొగ్గు చూపడం ఖాయమని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.