కేసీఆర్ కు స్టూడెంట్ వీడియో.. హాట్ టాపిక్

Update: 2019-06-29 11:07 GMT
తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడిచిపోయాయి. ఇంకా కొన్ని పాఠశాలల్లో మౌళిక వసతులు లేవు. అయినా విద్యార్థులు చదువుకుందామంటే అసలు టీచర్లే లేని స్కూళ్లు ఉన్నాయి. పాఠశాలలు విద్యార్థులు లేక ఎత్తివేయడం.. టీచర్ల రేషనైలేషన్ చేయడంతో పోవడంతో కొన్ని పాఠశాలల్లో ఫుల్లుగా టీచర్లుండగా.. మరికొన్నింటిలో విద్యార్థులున్నా టీచర్లు లేని పరిస్థితులున్నాయి. ఇప్పుడు ఈ దుస్థితిపై  సీఎం కేసీఆర్ కు ఓ చిన్నారి సంధించిన వీడియో చర్చనీయాంశంగా మారింది.

నాలుగో తరగతి విద్యార్థిని సీఎం కేసీఆర్ కు పంపిన వీడియో ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఆ వీడియో వైరల్ కావడంతో సమస్య అందరి దృష్టికి వచ్చింది.

గద్వాల జిల్లాలోని పెద్ద ధన్వాడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న సౌభాగ్య త పాఠశాల దీన స్థితిపై సీఎం కేసీఆర్ కు పంపిన వీడియో ఇప్పుడు ప్రభుత్వ విద్యావ్యవస్థ తీరును ఎండగడుతోంది. సౌభాగ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో ఒక్క టీచరు కూడా పాఠాలు చెప్పడానికి లేరని.. ఎలా చదవాలని.. ఒక టీచర్ ను అయినా పంపించండి కేసీఆర్ సార్ అంటూ వీడియోలో విజ్ఞప్తి చేయడం విశేషం.

పాఠశాలలు ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా పాఠశాలల్లో టీచర్ల లేని పరిస్థితి ఏవిధంగా ఉందనే విషయాన్ని సదురు విద్యార్థి చేసిన వీడియో బహిర్గతమైంది. సోషల్ మీడియాలో ఇటీవల ఓ రైతు పెట్టిన భూ సమస్య వీడియోకు స్పందించిన కేసీఆర్ మరి ఈ చిన్నారి స్కూల్ పరిస్థితిపై వివరించిన వీడియోతో ఎలా స్పందిస్తాడన్నది వేచిచూడాలి.  


Tags:    

Similar News