అరవై అడుగుల ఎత్తున్న ఫ్లైఓవర్ మీద నుంచి కారు రోడ్డు మీదకు పడటం.. ఆ ఉదంతంలో తన తప్పేమీ లేకున్నా ఒక సాధారణ మహిళ బలి కావటం పెను సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో పూర్తిగా తప్పు కారు డ్రైవ్ చేస్తున్న యువ పారిశ్రామికవేత్త మిలన్ రావుగా పలువురు చెబుతున్నారు.
ఫ్లైఓవర్ మీద గంటకు 40కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా 105 కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకుపోయి.. మలుపు వద్ద కారు కంట్రోల్ తప్పటం కారణంగా భారీ ప్రమాదం చోటు చేసుకోవటం తెలిసిందే. అయితే.. ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత అందరూ ఫ్లైఓవర్ డిజైన్ లోపం పేరుతోనే పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయే తప్పించి.. మితిమీరిన వేగంతో డ్రైవ్ చేసిన మిలన్ రావు తప్పును హైలెట్ చేసిందే లేదు.
చిన్న వయసులోనే ఒక కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్న మిలన్ రావు.. ఒక బిజినెస్ మీటింగ్ లో పాల్గొనటం కోసం ఇంత వేగంగా ప్రయాణించినట్లు చెబుతున్నారు. తాను ప్రయాణిస్తున్న హైఎండ్ ఫోక్స్ వ్యాగన్ కారణంతో స్వల్ప గాయాలతో బతికి బయటపడటం తెలిసిందే.అయితే.. ఫ్లైఓవర్ డిజైన్ లోపం పేరుతో మిలన్ రావును తెలంగాణ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎందుకిలా అన్న ప్రశ్నకు మిలన్ రావు కల్వకుంట ఇంటిపేరుతో పాటు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు దగ్గర బంధువులన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంతోనే మంత్రి కేటీఆర్ ఈ ఇష్యూను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు పలువురి నోట వినిపిస్తోంది . బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద శనివారం మధ్యాహ్నం
ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయకుంటే ఈ ప్రమాదమే జరిగి ఉండేది కాదని.. అలాంటప్పుడు నిర్లక్ష్యంతో వాహనాన్ని నడిపిన మిలన్ రావు మీద వెయ్యి రూపాయిల చలానా విధించారు. అదే సమయంలో ఒకరి ప్రాణాల్ని తీయటంతో పాటు.. మరికొందరు గాయాల బారిన పడటానికి కారణమైన ఆయనపై కఠిన సెక్షన్లను అమలు చేయకుండా మామూలు సెక్షన్లతో కేసు నమోదు చేశారన్న విమర్శ ఉంది.
హైప్రొఫైల్ ఫ్యామిలీ కావటం.. కల్వకుంట్ ఇంటిపేరుతోపాటు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బంధువులు కావటంతో సాంకేతిక లోపం.. రోడ్డు డిజైన్ లో ఉన్న లోపమే కారణమన్న పేరుతో విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లుగా చెబుతున్నారు. మిలన్ రావు మీద పెట్టిన సెక్షన్ ప్రకారం రెండేళ్లు జైలుశిక్షకు వీలుందని.. బెయిల్ బుల్ సెక్షన్లు పెట్టారంటున్నారు.
ప్రస్తుతం గాయాల బారిన పడటం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిలన్ రావుకు శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు చెబుతున్నారే తప్పించి.. మిగిలిన వివరాలు వెల్లడించటంలేదు. వాతావరణం కాస్త చల్లబడిన తర్వాత ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారన్న ఆరోపణ ఉంది. అయితే.. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైన వాదనలే తప్పించి.. మరింకేమీ లేదని.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.