లోకేష్ వార్నింగ్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?

Update: 2022-05-30 17:30 GMT
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన హెచ్చ‌రిక‌.. వ‌ర్క‌వుట్ అవుతుందా?  నాయ‌కులు లైన్‌లో ప‌డ‌తారా?  పార్టీకి బ‌లోపేతంగా మార‌తారా?  ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు పార్టీలో వినిపిస్తు న్నాయి. మ‌హానాడు వేదిక‌గా.. నారా లోకేష్ మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల విష‌యంపై ప్ర‌ధాన వ్యాఖ్య లు చేశారు. మూడు సార్లు ఓడిపోయిన నాయ‌కుల‌కు టికెట్ లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. అంతే కాదు.. పార్టీలో క‌లిసి మెలిసి ప‌నిచేసేవారికే ప్రాధాన్యం ఉంటుంద‌న్నారు.

అంటే.. మొత్తానికి ఇప్పుడు.. పార్టీలో అచేత‌నంగా ఉన్న నాయ‌కుల‌కు.. లోకేష్ గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. మ‌రి ఈ వార్నింగ్ ఏమేర‌కు ప‌నిచేస్తుంది? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న నాయ‌కులు చాలా మంది ఉన్నారు.

ముఖ్యంగా లోకేష్ చెప్పిన ప్ర‌కార‌మే చూసుకుంటే.. వ‌రుస ప‌రాజ‌యాలు పొందుతున్న నాయ‌కుల‌ను ప‌రిశీలిస్తే.. వీరిలో య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వంటివారు ఉన్నారు. మ‌రి ఇలాంటివారినికాద‌ని పార్టీ అడుగులు వేయ‌గ‌ల‌దా? అనేది ప్ర‌శ్న‌.

ఇక‌, పార్టీలో అంద‌రినీ క‌లుపుకొని పోవాలి.. అని చెబుతున్నారు. వాస్త‌వానికి ఇది కూడా సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఎక్క‌డిక‌క్క‌డ పార్టీలో కొత్త నేత‌లు వ‌స్తున్నారు. దీంతో పాత నేత‌ల‌ను క‌లుపుకొని పోవ‌డంలో కొన్ని ఇబ్బందులు వ‌స్తున్నాయి. వీటిని సరిచేయాల్సిన బాధ్య‌త పార్టీ అధిష్టానం పైనే ఉంటుంది. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కేడ‌ర్‌ను డెవ‌ల‌ప్ చేసే అవ‌కాశం కొత్త‌గా వ‌చ్చే నాయ‌కుల‌కు ఉండ‌దు. సీనియ‌ర్లే ఆ ప‌నిచేయాలి.

అంటే.. సీనియ‌ర్లు లేకుండా.. వారి ఉనికి లేకుండా.. పార్టీ ముందుకు సాగే అవ‌కాశం లేదు. అదేస‌మ‌యం లో మూడు సార్లు ఓడిపోయిన నాయ‌కుల‌కు టికెట్ ఇచ్చేది లేద‌ని అంటే.. పార్టీకి మ‌రింత ఇబ్బంది త‌ప్ప దు.. ఎందుకంటే.. గెలుపు ఓట‌ములు అనేవి.. పార్టీనేత‌ల‌తో సంబంధం లేదు.

ప్ర‌జ‌లు ఆ స‌మ‌యానికి ఉన్న ప‌రిస్థితిని బ‌ట్టి నేత‌ల‌ను ఎన్నుకుంటారు. కేవ‌లం.. గెలుపునే ప్రామాణికంగా తీసుకుని అడుగులు వేస్తే.. అది కూడా ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే అవుతుంది. ఈ నేప‌థ్యంలో లోకేష్ హెచ్చ‌రిక‌లు వ‌ర్క‌వుట్ కావ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News