సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అధినేతలు రెండు లేదా మూడు చోట్ల నుంచి పోటీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలనాటి ఎన్టీఆర్ నుంచి నేటి జనసేన పార్టీ అధినేత పవన్ వరకు అందరూ ఒకటికి మించి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఇలా రెండుచోట్ల పోటీ చేస్తే ఒక చోట ఓడిపోయినా మరో నియోజకవర్గంలో గెలిచి ప్రాతినిథ్యం వహించారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ పోటీచేసిన ప్రతీ చోట గెలుస్తూ వచ్చారు. తెలంగాణలోని మహాబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో మినహా అయన ఎంచుకున్న నియోజకవర్గ ప్రజలందరూ ఎన్టీఆర్ కు పట్టం కట్టడం విశేషం..
1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ అదే సంవత్సరంలో ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఆ సంవత్సరం కృష్ణాజిల్లాలోని గుడివాడ, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో పోటీ చేశారు. ఇలా పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన గెలుపొందారు. అయితే తిరుపతి స్థానానికి రాజీనామా చేసి గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు.
ఆ తరువాత 1985లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ మూడు ప్రాంతాల నుంచి పోటీ చేశారు. కోస్తా ప్రాంతంలోని గుడివాడ, రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లా హిందూపురం, తెలంగాణలోని నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మూడు ప్రాంతాల్లోనూ విజయం సాధించారు. అయితే ఈసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ నల్గొండ, గుడివాడలకు రాజీనామా చేశారు.
వరుసగా విజయదుందుభి సాగిస్తున్న సైకిల్ పార్టీ నుంచి ఎన్టీఆర్ 1989లో సైతం రెండు స్థానాల్లో పోటీ చేశారు. అయితే ఈసారి ఎన్టీఆర్‌కు ఓటర్లు షాకిచ్చారు. హిందూపురంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. హిందూపురంలో సీటు గెలిచిన ఎన్టీఆర్ కల్వకుర్తిలో పొగోట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్‌దాస్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తరువాత ఎన్టీఆర్ మళ్లీ తెలంగాణ వైపు చూడలేదు. ఆ తరువాతి ఎన్నికల్లో హిందూపురంతో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి పోటీ చేశారు. రెండూ చోట్లా విజయం సాధించినా ఎన్టీఆర్ టెక్కలికి రాజీనామా చేశారు.
ఎన్టీఆర్‌ను అనుసరించో లేక సెంటిమెంటనో తెలియదు గానీ పార్టీ స్థాపించిన ప్రతి ఒక్కరూ రెండు స్థానాల నుంచి పోటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి తిరుపతి నియోజకవర్గంతో పాటు పాలకొల్లులో బరిలో దిగారు. అయితే ఆయనకు సొంత నియోజకవర్గమైన పాలకొల్లు ప్రజలు షాకిచ్చారు. కానీ తిరుపతి నుంచి గెలుపొందారు.
తాజాగా జనసేన పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగిన పవన్‌కల్యాణ్ సైతం రెండు స్థానాల్లో పోటీ చేశారు. ఒకటి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కాగా.. రెండోది విశాఖ జిల్లా గాజువాక. ఈ రెండు నియోజకవర్గాల్లో ఆయన గెలిచేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఆయనకు మద్దతుగా అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం వెన్నంటే ఉంది. అయితే ఫలితాల రోజున ఆయన రెండు స్థానాలను దక్కించుకుంటాడా..? లేదా..? అనేది చూడాలి.