రాజకీయ వ్యూహకర్తగా యావత్ దేశంలోనే ఎంతో పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే)కి వైఎస్ షర్మిల పెద్ద పరీక్షే పెట్టారు. తెలంగాణాలో అధికారంలోకి రావటమే టార్గెట్ తా వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటు ఈమె పదే పదే చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పై తెలంగాణాలో ఉన్న మద్దతుదారులు, అభిమానులను చూసుకునే షర్మిల అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమాను వ్యక్తంచేస్తున్నట్లున్నారు.
సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తాను అధికారంలోకి రావటానికి వీలుగా గ్రౌండ్ లెవల్లో పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకోవటంతో పాటు జనాల నాడిని పట్టుకునేందుకు షర్మిల పీకేతో ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రశాంత్ టీము తరపున ఇప్పటికే చెన్నైకి చెందిన ప్రియా రాజేంద్రన్ రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీకే బృందంలో కీలకమైన ప్రియ సెప్టెంబర్ నుండి పూర్తిగా రంగంలోకి దిగబోతున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు కూడా గతంలోనే చెప్పాయి.
అయితే తాజాగా పీకేనే షర్మిలతో భేటీ అయినట్లు సమాచారం. షర్మిల పార్టీ తరపున తమ బృందం పనిచేస్తుందని, అవసరమైన సహాయ సహకారాలను అందించనున్నట్లు పీకే భరోసా ఇఛ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే షర్మిల పార్టీ కోసం పీకే బృందం పనిచేయటం నిజమే అయితే మరి టీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటనేది అర్ధం కావటంలేదు. ఎందుకంటే పీకే ఇప్పటికే కేటీయార్ తో రెండుసార్లు భేటీ అయినట్లు ప్రచారంలో ఉంది.
ఒకే రాష్ట్రంలో రెండు వేర్వేరు పార్టీల తరపున పీకే బృందం దేశంలో ఎక్కడా పనిచేసినట్లు లేదు. మరిపుడు తెలంగాణాలో మాత్రం ఎలా పనిచేస్తుందనేది ఆసక్తిగా మారింది. కేటీయార్ తో పీకే భేటీ అంటే అధికారంలోకి వచ్చే విషయం తప్ప మరో అవసరం ఏమీ కనిపించటంలేదు. ఇదే పనిమీద పీకే బృందం ఇప్పటికే షర్మిలతో భేటీలు జరిపింది వాస్తవమంటున్నారు. అంటే పీకే బృందం తెలంగాణాలో డబల్ యాక్షన్ చేస్తుందేమో తెలీదు.
సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే షర్మిల పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళటం పీకేకు పెద్ద పరీక్షనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికైతే షర్మిల పార్టీ విషయంపై జనాల్లో పెద్ద చర్చలు జరగటం లేదనే చెప్పాలి. ఇక మిగిలిన పార్టీలైతే వైఎస్సార్టీపీని ఓ రాజకీయపార్టీగా కూడా గుర్తించటంలేదు. ఇప్పటివరకు బేస్ ఉన్న పార్టీకి పనిచేసి పీకే సక్సెస్ సాధించారు. కానీ మొదటిసారి జనాల్లో లేని పార్టీ తరపున పనిచేయటమంటే పీకేకి పెద్ద సవాలనే చెప్పాలి. మరి ఈ పరీక్షలో పీకేకు ఎన్ని మార్కులొస్తాయో చూడాల్సిందే.