ఆ బిల్లుకు మద్దతిస్తే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే

Update: 2020-01-30 04:04 GMT
కేంద్రంలోని బీజేపీ తో సఖ్యత తో ముందుకెళ్తోంది ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం. అందుకే కేంద్రం ఏ బిల్లు తెచ్చినా మొదట మద్దతిస్తోంది వైసీపీ నే. దేశంలోని ముస్లింల ఆగ్రహానికి గురైన సీఏఏ, ఎన్నార్సీ చట్టాలకు సైతం వైసీపీ పార్టీ మద్దతు ను పార్లమెంట్ లో ప్రకటించింది. దీనికి కారణం లేకపోలేదు. ఏపీలో ముస్లిం మైనార్టీల జనాభా చాలా తక్కువ. ఓట్ల కోణంలో వైసీపీ ఈ సీఏఏ, ఎన్నార్సీలకు మద్దతునిచ్చింది. తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువ కావడంతో టీఆర్ఎస్ సర్కారు ఓటు బ్యాంకు కారణంతో వ్యతిరేకించింది.

అయితే వైసీపీ నిర్ణయాన్ని తాజాగా అదే పార్టీకి చెందిన వైసీపీ శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వ్యతిరేకించారు. ముస్లింలపై వివక్ష చూపేలా కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు తమ పార్టీ మద్దతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.

తమ వైసీపీ పార్టీ ఎంపీలు పార్లమెంటు లో సీఏఏ, ఎన్ఆర్సీలకు మద్దతివ్వడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కుండబద్దలు కొట్టారు. ముస్లింలకు ఇబ్బందులు తలపెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే రాజీనామా చేసేందుకు వెనుకాడనని తెలిపారు.

ఇక సీఏఏ, ఎన్సార్సీలకు మద్దతు ఇవ్వవద్దని సీఎం జగన్ దృష్టి కి తీసుకెళుతానని ఎమ్మెల్యే శిల్పా తెలిపారు. ఆ చట్టాలతో ఎవరికి ఎలాంటి ముస్లింలకు నష్టమేనని తెలిపారు.
Tags:    

Similar News