సచిన్ భారత రత్న వెనక్కి తీసుకుంటారా?

Update: 2021-10-04 06:30 GMT
దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును అతి చిన్న వయసులోనే సొంతం చేసుకున్న క్రీడాకారుడు కమ్ క్రికెట్ దేవుడు సచిన్ టెండ్కూలర్. 2014లో ఆయనకు భారతరత్న పురస్కారాన్ని నాటి యూపీఏ ప్రభుత్వం అందచేసింది. సచిన్ ను భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయటంపై పలువురు తప్పు పట్టటంతో పాటు.. కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆయనపై  చేసిన ఆరోపణల్ని కొట్టి పారేసిన సుప్రీంకోర్టు.. ఆయన మీద చేసిన ఆరోపణల కారణంగా భారతరత్న పురస్కారానికి అర్హత లేదనటం సరికాదని తేల్చింది.

ఇదంతా జరిగిపోయిన కథ. ఇప్పుడు జరగాల్సింది మిగిలి ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనల్ని క్రియేట్ చేస్తున్న పండోరా పేపర్ లీక్స్ లో.. భారత్ కు చెందిన 300 మందికి పైగా పేర్లు ఉన్నాయని.. పన్ను ఎగవేతతో పాటు.. నిధుల్ని అక్రమ పద్దతిలో తరలించిన వైనంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అంబానీ సోదరుల్లో తరచూ వివాదాల్లో ఇరుక్కునే అనిల్ అంబానీ పేరు తాజాగా పండోరా పేపర్స్ లో దర్శనమిచ్చింది. ఆయనతోపాటు మరికొందరి పేర్లు బయటకు వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాత్రికేయుల్లో కొందరు టీంగా ఏర్పడి.. రహస్య పత్రాల్ని తమదైన శైలిలో గుర్తించి.. వాటి మీద విచారణ జరిపి.. వారి ఆరాచకాల్ని బయటపెట్టటం తెలిసిందే. భారతదేశం నుంచి ఇండియన్ ఎక్స్ ప్రెస్ మీడియా సంస్థకు చెందిన పాత్రికేయులు ఈ ఆపరేషన్ లో పని చేశారు. 117 దేశాలకు చెందిన 600 మంది జర్నలిస్టులు 1.19 కోట్ల పత్రాల్ని పరిశీలించి అక్రమార్కుల చిట్టాను సిద్ధం చేశారు. ఇందులో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆఫ్ షోర్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణను ఎదుర్కొంటున్న సచిన్ కు ఇప్పటికే భారతరత్న పురస్కారం అందజేసిన వేళ.. తాజాగా బయటకొచ్చిన పండోరా పేపర్స్ కారణంగా.. ఆయనకు ఇచ్చిన అత్యున్నత పురస్కారం మాటేమిటి? దేశంలో ఏడో అత్యుత్తమ స్థానంలో (భారతరత్న పురస్కారానికి ఎంపికైన వారికి ప్రత్యేకమైన అధికారాలు ఉండవు కానీ.. ప్రోటోకాల్ ప్రకారంగా చూస్తే దేశంలో 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి.. ప్రధానమంత్రి.. రాష్ట్ర గవర్నర్లు.. మాజీ రాష్ట్రపతులు.. ఉప ప్రధానమంత్రి.. ముఖ్య న్యాయమూర్తుల తర్వాత గౌరవం లభించేది భారతరత్న పురస్కారాన్ని సొంతం చేసుకున్న వారికే) ఉన్న నేపథ్యంలో.. పండోరా పేపర్స్ మరక సచిన్ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తుందని చెప్పాలి.

ఈ క్రమంలో ఆయనకు ఇచ్చిన అత్యున్నత పౌర పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. పరిస్థితి మరోలా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికి పేరు మాత్రమే బయటకు వచ్చింది కానీ.. ఆయన ఎలాంటి తప్పుడు పనులు చేశారన్న ఆరోపణకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. మొత్తంగా పండోరాలో సచిన్ పేరు రావటం ద్వారా.. ఆయనకు కొత్త తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఆయనకు సదరు పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయం మీద ఇప్పటికే చర్చ జరిగిన నేపథ్యంలో.. తాజా మరక ఆయనకు అందిన పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలన్న అంశం మీద చర్చజరిగే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News