24 గంటలు చాలు..అయోధ్య కేసు తేల్చేస్తాం: యోగి ఆదిత్యనాథ్‌

Update: 2019-01-28 05:34 GMT
దేశవ్యాప్తంగా ఎన్నికలకు టైమ్‌ దగ్గపడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి మొదటివారంలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో. ఎవరికి వారు ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే.. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం  బీజీపీ 10శాతం రిజర్వేషన్‌ కల్పించింది. ఇక బీజేపీకి ఎవర్‌ గ్రీన్‌ ఆయుధం అయోధ్య కేసు కూడా ఇప్పుడు ఈ ఎన్నికలకు తోడైంది. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు మాత్రమే రామ మందిరం ప్రస్తావన తీసుకువచ్చే బీజేపీ శ్రేణులు .. అయోధ్య కేసుని త్వరగా తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక ఉత్రర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మరో అడుగు ముందుకు వేశారు. తమకు 24 గంటలు సమయం ఇస్తే. ఆయోధ్య కేసుని తేల్చేస్తామంటూ ప్రకటించారు.

అయోద్య కేసుని త్వరగా తేల్చండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. లేదా మాకైనా అప్పగించండి. రామజన్మభూమి వివాదాన్ని 24 గంటల్లో పరిష్కరిస్తాం. అంతకంటే అదనంగా ఒక్క గంట సమయాన్ని కూడా తీసుకోం. లక్షల మంది ప్రజలను విశ్వాసాలకు ప్రతీకగా తీర్పు ఉండాలని ఆకాక్షిస్తున్నాం. అనవసర జాప్యం… ప్రజల్లో అసహనానికి దారి తీస్తోందని అన్నారు యోగీ ఆదిత్యానాథ్‌.

మరోవైపు.. అయోధ్య కేసు లెక్క ప్రకారం.. ఈ మంగళవారం (జనవరి 29) విచారణకు రావాల్సి ఉంది. అయితే.. కేసుని విచారించాల్సిన ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒక న్యాయమూర్తి అందుబాటులో లేరు. దీంతో.. మంగళవారం నాడు కేసు విచారణ ప్రారంభం కావడం లేదని సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజిస్ట్రార్‌ ఆదివారం ఒక సర్కులర్‌ జారీ చేశారు. మళ్లీ ఎప్పుడు విచారణ చేసేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.


Tags:    

Similar News