ఆగస్టుకు తెలుగుదేశం పార్టీకి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరమే లేదు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆగస్టు వస్తుందంటే చాలు తెలుగుతమ్ముళ్లు తెగ వణికిపోతుంటారు. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీకి సంబంధించి ఏ సంక్షోభమైనా సరే ఆగస్టులోనే చోటు చేసుకుంటుంది. దీంతో.. ఆగస్టు ఫోబియో టీడీపీకి మొదట్నించి ఉన్నదే.
ఐదేళ్ల అధికారం తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవర్ పోయిన నేపథ్యంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి నిండా కనుకు లేకుండా చేస్తోందట. పవర్ పోయినంతనే.. అప్పటివరకు కుడి.. ఏడమ భుజాలు మాదిరిగా వ్యవహరించిన సుజనా.. సీఎం రమేశ్ లు బీజేపీలో చేరిపోతే.. మరో సన్నిహితుడు నారాయణ అడ్రస్ కనిపించని పరిస్థితి. పవర్లో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారి కంటే కూడా కార్పొరేట్ తరహాలో లాబీయింగ్ చేసుకునే వారికి పదవులుకట్టబెట్టే చంద్రబాబుకు.. దానికి తగ్గట్లే వారు తమదైన శైలిలో షాకులు ఇస్తూ పార్టీని వీడిపోతున్నారు.
జగన్ కారణంగా బాబుకు భవిష్యత్తు లేదని.. పార్టీ ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేదన్న వాదన అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. టీడీపీ తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున వలసలు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల మీద కన్నేసిన మోడీషాలు.. ఏలా అయినా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా తొలుత తెలంగాణను టార్గెట్ చేసిన వారు.. ఏపీలో టీడీపీ స్థానాన్ని తాము చేజిక్కించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే టీడీపీకి చెందిన బలమైన నేతలకు గాలం వేస్తున్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఆగస్టులోనే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని.. బాబుకు షాకిస్తూ పలువురు తమ్ముళ్లు పార్టీ మారిపోవటం ఖాయమంటున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలతో బీజేపీ టచ్ లోకి రావటమే కాదు.. ఒక దఫా చర్చలు విజయవంతంగా ముగిసాయి. పార్టీలోకి పలువురు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ వారి మాటలే నిజమైన పక్షంలో బాబుకు ఈ ఆగస్టు భారీ గండంగా మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరీ అంచనా ఎంతవరకూ నిజమన్నది ఆగస్టు అయ్యే లోపు క్లారిటీ రావటం ఖాయం.