ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన ఏ క్షణాన దీన్ని సొంతం చేసుకున్నాడో ఏమో కానీ అందరినీ తొలగించి షాక్ ఇచ్చాడు. ఉన్నతాధికారులను గెట్ అవుట్ అన్నాడు. ఇక ట్రంప్ లాంటి వివాదాస్పద నేతను ట్విటర్ లోకి ఆహ్వానించాడు. దీంతో పాటు బ్లూటిక్ పేరిట డబ్బులు వసూలు చేయడంతో అందరూ అక్రమార్కులు చెల్లించి ట్విటర్ లో ఏది నకిలీనో.. ఏది అసలునో తెలియకుండా మారింది.
ఈ పరిణామంతో కార్పొరేట్ కంపెనీలు ట్విటర్ కు యాడ్స్ ఇవ్వడం మానేశాయి. తాజాగా ఎలన్ మస్క్ కు మరో భారీ షాక్ తగిలింది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కూడా ట్విటర్ లో యాడ్స్ ను నిలిపివేసింది. ఈ విషయంపై మస్క్ స్వయంగా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై యాపిల్ ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే యాపిల్ ఏకంగా ట్విటర్ లో యాడ్స్ నిలిపివేయడం మాత్రం చర్చనీయాంశమైంది.
ఎలన్ మస్క్ ట్వీట్ చేస్తూ 'యాపిల్ ట్విటర్ లో ప్రకటనలను నిలిపివేసింది. వారు అమెరికాలో వాక్ స్వాతంత్ర్యాన్ని ద్వేషిస్తారా? టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది' అని ట్వీట్ లో ప్రశ్నించారు.ట్విటర్ లో యాడ్స్ ఇవ్వుకుండా సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారనే అనుమానాలు మస్క్ వ్యక్తం చేశాడు.
ఎలన్ మస్క్ కొనకముందు ఇదే యాపిల్ సంస్థ ట్విటర్ లో అక్టోబర్ 16-22 మధ్యలో 2,20,800 డాలర్ల యాడ్స్ ఇచ్చింది. ఎలన్ మస్క్ తీసుకున్నాక 1,31,600 డాలర్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇప్పుడు పూర్తిగా ఆపేశాయి.
ఇక యాపిల్ నే కాదు.. ఇదివరకే జనరల్ మిల్స్ ఇంక్, ఆడి సహా అనేక కంపెనీలు ఎలన్ మస్క్ ట్విటర్ కొన్నాక ప్రకటనలను ఆపేశాయి. జనరల్ మోటార్స్ కూడా తాత్కాలికంగా నిలిపేసింది.
యాపిల్ యాడ్స్ నిలిపివేయడంతో ఎలన్ మస్క్ ఆ సంస్థపై యుద్ధం ప్రకటించాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ నిలదీస్తున్నాడు. 'యాప్ స్టోర్ లో ట్విటర్ యాప్ ను బ్లాక్ చేస్తానని యాపిల్ బెదిరిస్తోందంటూ' మస్క్ ట్వీట్ చేశారు. వినియోగదారులను ప్రభావితం చేసేలా తాను తీసుకున్న అన్ని సెన్సార్ షిప్ చర్యలను యాపిల్ బహిర్గతం చేయాలంటూ మస్క్ ట్విటర్ లో పోల్ పెట్టాడు. యాప్ స్టోర్ ల ఏం కొన్నా యాపిల్ 30శాతం ట్యాక్స్ ను రహస్యంగా విధిస్తోందంనే విషయం మీకు తెలుసా? ' అంటూ మరొక ట్వీట్ చేసి ఆ సంస్థ పైయుద్ధాన్ని కొనసాగిస్తున్నారు మస్క్. వీరి వైరం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఇప్పటికైతే యాపిల్ నుంచి ఎలాంటి ప్రతి స్పందన రాలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.