వైసీపీ.. మ‌రో ప్ర‌జారాజ్యం అవుతుందా? పొలిటిక‌ల్ గుస‌గుస‌!

Update: 2022-06-28 04:29 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి వైసీపీ విజ‌యం ద‌క్కించుకోక‌పోతే... ఖ‌చ్చితంగా ఈ పార్టీ మ‌రో ప్ర‌జారాజ్యం  అయిపోవ‌డం ఖాయ‌మ ని అంటున్నారు. దీనికి కార‌ణాలు కూడా చెబుతున్నారు. ప్ర‌స్తుతం 151 సీట్ల‌తో బ‌ల‌మైన పార్టీగా ఉన్న వైసీపీని డైల్యూట్ చేసేందుకు సొంత పార్టీ నాయ‌కులే ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్లు ద‌క్క‌క‌పోతే.. ఇదే జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ విష‌యంలోనూ.. సొంత పార్టీ నాయ‌కులు.. పార్టీ అధినేత చిరంజీవి న‌మ్ముకున్న నాయ‌కులు... పార్టీని డైల్యూట్ చేశార‌నే విష‌యాన్ని ఇప్పుడు తెర‌మీదికి తెస్తున్నారు. ఫ‌లితంగా.. ఆయ‌న ఇలాంటి వారితో వేగ‌లేక‌.. పార్టీని కాంగ్రెస్ చేతిలో పెట్టి.. ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు. ఇప్పుడు ఇదే ప‌రిస్తితి వైసీపీకి కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి రాక‌పోతే.. పార్టీలో ఎవ‌రూ మిగిలేలా లేర‌ని ప‌రిశీల‌కులు గట్టిగా చెబుతున్నారు.  

అదేస‌మ‌యంలో ఏపీలో పుంజుకోవాల‌ని భావిస్తున్న బీజేపీ.. వైసీపీని టార్గెట్ చేసుకుని.. ముందుకు సాగితే.. ఆపార్టీ లోని నేత‌ల‌ను న‌యానో.. భ‌యానో.. త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌ధానంగా ప్ర‌య‌త్నిస్తుం ద‌ని.. కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం పార్టీలోని ఎక్కువ‌ శాతం మంది నాయ‌కులు ఏదొ ఒక వ్యాపారంలో ఉన్నారు. ముఖ్యంగా గ‌నుల విష‌యంలో అనేక ఆరోప‌ప‌ణ‌లు వ‌స్తున్నాయి. గ్రావెల్ త‌వ్వ‌కాలు విచ్చ‌ల‌విడిగా సాగుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలో రేపు వైసీపీ కాకుండా వేరే పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ఇలాంటి వారికి మూడిన‌ట్టేన‌ని చ‌ర్చ సాగుతోంది.

అయితే.. ఇలాంటి వారంతా.. వైసీపీపై ఎలాంటి ప్రేమ చూపించేందుకు రెడీగా లేర‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నుక అధికారంలోకిరాక‌పోతే.. రాజ‌కీయంగా వీరు త‌మ దారి తాము చూసుకుని సేఫ్ అయ్యేందుకు  రెడీ అవుతార‌ని..  ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, అప్పుడు.. వీరికి ఉండే ప్ర‌త్యామ్నాయం.. బీజేపీనే! ఈ స‌మ‌యం కోస‌మే ..బీజేపీ ఎదురు చూస్తోంద న్నది ఢిల్లీ వ‌ర్గాల మాట‌. వాస్త‌వానికి టీడీపీ బ‌ల‌హీన ప‌డితే.. ఆ గ్యాప్ ను తాను భ‌ర్తీ చేయాల‌ని బీజేపీ భావించింది.

కానీ, అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు వైసీపీపై బీజేపీ దృష్టి పెట్టింద‌ని... వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్క‌కుండా కేవ‌లం 50, 60 స్థానాల‌కే ప‌రిమితం అయితే.. మిగిలిన వారిపై కేసుల కత్తి ఎత్తి.. త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేసే అవ‌కాశం ఉంద‌ని.. విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి దీనిని జ‌గ‌న్ ఎలా ఆపుతారు? ఆయ‌నపైనే అనేక కేసులు ఉన్నాయి క‌దా! అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News