త‌గ్గేదిలే.. ఈ రోజు ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారా బిల్లుల కోసం!

Update: 2022-07-11 10:49 GMT
చేస్తున్న ప‌నులకు ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించ‌డం లేదు. దీంతో కాంట్రాక్ట‌ర్లు అల్లాడిపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా సొంత పార్టీ నాయ‌కులు కూడా రోడ్డున ప‌డుతున్నారు. తాము ప‌నులు చేస్తున్నా.. నిధులు విడుద‌ల చేయ‌డం లేదంటూ.. ఆందోళ‌న‌కు దిగుతున్నారు.

ఇలాంటి వారిలో ప్ర‌కాశం జిల్లాలో ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ ముందున్నారు. మిగిలిన వారు అంతో ఇంతో బాధ‌ను క‌డుపులో దాచుకుంటున్నా.. ఈయ‌న మాత్రం బ‌య‌ట ప‌డిపోయారు. ఇటీవ‌ల జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గం ప్లీన‌రీలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన ప‌నుల‌కు సంబంధించి 100 కోట్లు పెండింగులో ఉన్నాయ‌ని సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు.

``నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 100 కోట్ల రూపాయ‌ల మేర‌కు ప‌నులు జ‌రిగాయి. అయినా.. నిదులు ఇవ్వ‌డం లేదు`` అని ఆయ‌న ఓపెన్‌గా నే చెప్పుకొచ్చారు. అంతేకాదు.. గ‌డ‌ప‌గ‌డ‌పకు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం కింద వెళ్తే.. ప‌నిచేసిన వాళ్లు త‌మ‌ను నిల‌దీస్తున్నార‌ని కూడా ఆయ‌న నిప్పులు చెరిగారు. చేసిన ప‌నుల‌కు నిదులు ఇవ్వ‌క‌పోతే.. వారు ఎలా ముందుకు సాగుతార‌ని.. అప్పులకు వ‌డ్డీలు కూడా క‌ట్టుకోలేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. ద‌ర్శి ఎమ్మెల్యే వాపోయారు. ఇదంతా కూడా ఆయ‌న ప్లీన‌రీలోనే వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇదే జిల్లాకు చెందిన ఎంపీ.. మాగుంట కూడా త‌న‌కు తెలిసిన ఒక కాంట్రాక్ట‌ర్ బిల్లులు రాక అప్పులు తెచ్చుకున్న ద‌గ్గ‌ర వాటిని తీర్చ‌డానికి ఇబ్బందులు ప‌డ్డార‌ని తెలిపారు. ఆ అప్పులు త‌న సొంత ఇంటిని అమ్మి క‌ట్టి.. అద్దె ఇంట్లో ఉంటున్నాడ‌రి చెప్పారు. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలకు స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డం లేదు. కొంత మంది మాత్ర‌మే బ‌య‌ట‌ప‌డుతున్నారు. అలానే కేడ‌ర్ కూడా ఇదే చెబుతున్నారు. అంత‌లో జిల్లా అధ్య‌క్షుడు తీసుకుని.. జూలై 10 లోప‌ల ఇస్తామ‌ని.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి త‌న‌కు స‌మాచారం వ‌చ్చింద‌ని చెప్పారు.

దీంతో ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ ఒక‌వేళ రాక‌పోతే.. ఎలా అంటే.. `` త‌గ్గేది లే`` అని బుర్రా మ‌ధుసూద‌న్ చెప్పార‌ట‌.  కేడ‌ర్ అంతా రాష్ట్ర ప్లీన‌రీలో జ‌గ‌న్ ఒక క్లారిటీ ఇస్తారేమో అని అనుకున్నారు. కేడ‌ర్‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా.. చూసుకుంటా అని.. చెబుతాడేమో.. అని వేచి చూసినా.. పెద్ద‌గా చెప్ప‌లేదు. కాబ‌ట్టి. కేడ‌ర్‌కి.. పెద్ద‌గా న్యాయం అయ్యేట‌ట్టు లేద‌ని.. కేడ‌ర్ అంటున్నారు.  

మ‌రి జిల్లా అధ్య‌క్షుడు క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ మాట ఇచ్చాడు కాబ‌ట్టి.. జిల్లాలో ఉన్న పెండింగ్ బిల్లులు అన్నీ.. ఆయ‌న ఇస్తారా? అని ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్లు వేచి చూస్తున్నారు. మ‌రి ద‌ర్శి ఎమ్మెల్యే ఈ విష‌యంలో క‌నిగిరి ఎమ్మెల్యే మీద ఉసిగొల్పుతారా?  లేదా? అని ద‌ర్శి, క‌నిగిరిలో ఉన్న నాయ‌కులు పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు. చూద్దాం.. ఏం జ‌రుగుతుంందో బిల్లుల గురించి.. అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. 
Tags:    

Similar News