దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. వరుస అత్యాచారాలతో ఢిల్లీ ప్రతిష్ట మసకబారుతోంది. తాజాగా దేశ ఔన్నత్యానికే చిహ్నమైన రాష్ట్రపతి భవన్ లో ఓ అత్యాచారకాండ దేశవ్యాప్తంగా సంచలనమైంది. భారత రాష్ట్రపతి నివాసం ఉండే ఇక్కడే మహిళలకు రక్షణ లేకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది.
రాష్ట్రపతి భవన్ లోని స్టాఫ్ క్వార్టర్స్ లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఢిల్లీకి చెందిన ఎంఎస్సీ స్టూడెంట్ మీద రాష్ట్రపతి భవన్ లో పనిచేసే ఉద్యోగి అత్యాచారం చేసినట్టు సమాచారం.
నిషాంత్ యాదవ్ అనే వ్యక్తి రాష్ట్రపతి భవన్ లో పనిచేస్తున్నాడు. రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్ లోనే నివాసం ఉంటున్నాడు. నిషాంత్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మంగళవారం రాత్రి తనపై లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి భవన్ స్టాఫ్ క్వార్టర్స్ కు తనను పిలిచి తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆరోపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నిషాంత్ యాదవ్ పరారీలో ఉన్నట్టు తెలిసింది.