ఏ దేశమేగినా డిస్క్రిమినేషన్ మాత్రం తప్పదేమో. పాశ్చాత్యులు కూడా ఒక్కోసారి కనీస మానవ విలువలు మరిచిపోతుంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన యుకె దేశపు ప్రఖ్యాత ఎయిర్ లైన్స్ బట్టలు సరిగా వేసుకోలేదని ఓ యువతిని ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకున్నారు. మరీ దారుణం ఏంటంటే... వారికి ప్రయాణికులు వంత పాడటం. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. బాధితురాలి పేరు ఎమిలి ఓ కాన్నర్.
జస్ట్ 21 ఏళ్ల ఆ అమ్మాయి. ప్రయాణంలో సౌకర్యంగా ఉంటాయని సింపుల్ టాప్, ఒక లూజు ఫ్యాంటు వేసుకుంది. ఆమె ఒక ట్రైనీ ఉద్యోగి. థామస్ కుక్ ఎయిర్ లైన్స్ లో స్పెయిన్ లోని టెనెరిఫి వెళ్లడానికి బర్మింగ్ హాం ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఆమె ఆహార్యాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది గాని, చెక్ ఇన్ లో గాని ఎక్కడా ఎవరూ అభ్యంతర పెట్టలేదు. కానీ థామస్ కుక్ ఫ్లైట్ సిబ్బంది మాత్రం ఈ డ్రెస్సు తో ఫ్లైట్ ఎక్కడానికి వీళ్లేదని పేర్కొంది. దీంతో ఆమె ప్రయాణికుల మద్దతు కోరింది. అయితే, దురదృష్టవశాత్తూ ఆమెకు వారి మద్దతు లభించలేదు. అసలు టిక్కెట్ బుక్ చేసేటపుడు మీరు డ్రెస్ కు సంబంధించిన నిబంధనలేవీ మాకు చెప్పలేదని ఆమె వాదించిన సిబ్బంది వినకుండా కిందకు దింపేశారు. అయితే, వారు థామస్ బుక్ మాన్యువల్ ప్రకారం మీ డ్రెస్ లేదంటూ ఓ పెద్ద బుక్ లో షరతులు చూపించారు. ఏ సంజాయిషీ వినకుండా కిందకు దింపేశారు. దీనిపై ఆగ్రహం చెందిన ఎమిలీ అదే డ్రెస్సు లో ఫొటో దిగి ట్విట్టరులో పోల్ పెట్టింది. నా డ్రెస్ సరైనదా? కాదా? అంటూ ఆమె పెట్టిన పోల్ కు దాదాపు లక్ష మంది రెస్పాండ్ అయ్యారు. వారిలో 80 శాతం దాకా ఆమె డ్రెస్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదనేశారు.
అయితే, సోషల్ మీడియా మద్దతు ఆమెకే ఉన్నా ఆమె ప్రయాణం మాత్రం సాగలేదు. కానీ థామస్ కుక్ ఎయిర్లైన్స్ ఆమెకు సారీ అయితే చెప్పింది గాని వారిది తప్పు అని మాత్రం ఒప్పుకోలేదు. మిమ్మల్ని మా వాళ్లు సరిగా హ్యాండిల్ చేయలేదు సారీ. కానీ వయసు, జెండర్ తో సంబంధం లేకుండా మేము మా నిబంధనలను పాటిస్తాం అని పేర్కొంది.