కలకలం: రాష్ట్రపతి భవన్ లో కరోనా పాజిటివ్ కేసు!

Update: 2020-04-21 04:50 GMT
భారత రాష్ట్రపతి కొలువుంటే రాష్ట్రపతి భవన్ కు కరోనా వైరస్ పాకింది. ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో రాష్ట్రపతికి ఏమైంది అని అందరూ ఆరాతీయడం మొదలు పెట్టారు.

తాజాగా రాష్ట్రపతి భవన్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అధికారులు వెంటనే అందులో పనిచేసే 125 కుటుంబాలను స్వీయ నిర్బంధంలోకి పంపారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి 100 మంది సిబ్బందిని నిర్బంధించారు.

రాష్ట్రపతి భవన్ లో ఇల్లును శుభ్రపరిచే సిబ్బంది ఒకరికి  లక్షణాలు కనిపించడంతో సోమవారం కరోనా వైరస్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో అతడితోపాటు పనిచేసేవారు.. గదులను శుభ్రపరచే వారిని.. సంబంధం ఉన్న వారందరినీ నిర్బంధించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ హఠాత్ పరిణామానికి రాష్ట్రపతి భవన సముదాయంలో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ లోని మొత్తం 125 కుటుంబాలను తదుపరి నోటీసులు వచ్చే వరకు ఐసోలేషన్ లో ఉంచారు.  రాష్ట్రపతికి ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమీ లేదని.. కరోనా పాజిటివ్ వ్యక్తులు రాష్ట్రపతికి సన్నిహితంగా లేరని తెలిసింది.
Tags:    

Similar News