మోడీ ర్యాలీలో పాల్గొన్నందుకు భార్య‌కు త‌లాక్‌

Update: 2017-12-10 09:41 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ముస్లిం మ‌హిళ‌ల్లో పెరుగుతున్న ఆద‌ర‌ణ‌కు ఇదో నిద‌ర్శ‌నం. అదే స‌మ‌యంలో...ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న ఆ వ‌ర్గంలోని కొంద‌రి తీరుకు కూడా ఉదాహ‌ర‌ణ‌. ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీలో పాల్గొన్న ఓ ముస్లిం మహిళకు తన భర్త విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌ బరేలీలో చోటు చేసుకుంది. గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోడీ శనివారం నిర్వహించిన ర్యాలీలో ఫయ్‌రా అనే ముస్లిం మహిళ పాల్గొంది. త్రిపుల్ తలాఖ్‌ పై చట్టం చేస్తామని మోడీ చెబుతున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నట్లు ఫయ్‌ రా తెలిపింది.

అయితే ర్యాలీ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తనకు తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. త్రిపుల్ తలాఖ్ విషయంలో మోడీ ఏం చేయలేడని తన భర్త చెప్పినట్లు వెల్లడించింది. తాము ఎప్పుడైనా త్రిపుల్ తలాఖ్ చెప్పొచ్చని భర్త చెప్పాడని బాధితురాలు వాపోయింది. తన భర్తకు అతని ఆంటీతో వివాహేతర సంబంధాలున్నాయని తెలిపింది. నన్ను, నా కుమారుడిని తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని ఫయ్‌ రా కన్నీరు పెట్టుకుంది. మైనార్టీ మ‌హిళ‌ల‌కు త‌లాఖ్ వ‌రం వంటిద‌ని ఆమె వెల్ల‌డించారు.

దీనిపై భర్త డానిష్ స్పందిస్తూ.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉండటంతోనే విడాకులు ఇచ్చానని స్పష్టం చేశారు. మోడీ ర్యాలీలో పాల్గొన్నందుకు తాను విడాకులు ఇవ్వలేదని తెలిపాడు. త‌న‌కు ఎవ‌రితోనూ అక్ర‌మ సంబంధం లేద‌న్నాడు. అయినా...త‌న భార్య మోడీ ర్యాలీలో ఎందుకు పాల్గొనాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించాడు.
Tags:    

Similar News