దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. ప్రియుడి మోజులో పడిన ఒక మహిళ కట్టుకున్న భర్తను చంపేసిన తీరు ఒక ఎత్తు అయితే.. దాని నుంచి తప్పించుకోవటానికి ఆడిన నాటకం షాకింగ్ గా మారింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించి వింటే.. మానవ సంబంధాలపై కొత్త సందేహాలు పుట్టుకు రాక మానవు. ఢిల్లీలోని అశోక్ విహార్ కు చెందిన 46 ఏళ్ల శరత్ దాస్.. ముప్ఫై ఏళ్ల భార్య అనితతో కలిసి ఉంటున్నారు.
మే రెండున శరత్ నిద్ర లేవకపోవటంతో.. అనారోగ్యంతో మరణించారని భార్య పేర్కొంది. ఇప్పుడు నడుస్తున్న కరోనా కాలాన్ని తన అవసరానికి వాడేసిన ఆమె.. కరోనాతో తన భర్త మరణించినట్లుగా పేర్కొంది. ఎలాంటి ఆరోగ్య సమస్య లేని శరత్ దాస్.. ఉన్నట్లుండి మరణించటంపై ఇరుగుపొరుగు వారికి సందేహాలు కలిగాయి. హడావుడిగా జరుగుతున్న అంత్యక్రియల కార్యక్రమాన్ని వారు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో..రంగంలోకి దిగిన పోలీసులు శరత్ డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు. అందులో ఊపిరి ఆడక మరణించినట్లుగా తేలింది. కరోనా పాజిటివ్ అని చెప్పే నివేదిక చూపించాలని అనితను పోలీసులు ప్రశ్నించారు. తమదైన శైలిలో విచారించగా.. అసలునిజాన్ని ఒప్పేసుకుంది. తాను సంజయ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నానని.. ఈ విషయం మీద తనకు.. తన భర్తకు తరచూ గొడవలు జరిగేవని చెప్పింది. భర్తను అడ్డు తొలిగించుకునేందుకు నిద్ర పోతున్న సమయంలో దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసినట్లుగా చెప్పింది. ఆమె మాటలకు పోలీసులు సైతం అవాక్కు అయ్యారు.